విజయ్ సేతుపతితో ఢీకొట్టనున్న కమలహాసన్..?

Divya
టాలీవుడ్ లో ,కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందారు కమలహాసన్. ఇక గత కొన్ని సంవత్సరాలుగా కమలహాసన్ సినిమాలుకు గుడ్ బై చెప్పారు అని ప్రచారం జరుగుతూనే ఉంది. రాజకీయాలలో బిజీ అవుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా సరైన సినిమా సక్సెస్ పడకపోవడంతో ఇటీవల ఇండస్ట్రీకి దూరమయ్యే ఆలోచనలు ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. తాజాగా విడుదలైన విక్రమ్ సినిమా తర్వాత ఏకంగా ఆరు పైగా సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం.

కరోనా తర్వాత విక్రమ్ సినిమా తో పలు రికార్డులను క్రియేట్ చేశారు కమలహాసన్. డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో కమలహాసన్ ఒక సినిమా చేయబోతున్నట్లు కన్ఫామ్ చేయడం జరిగింది. డైరెక్టర్ వినోద్, అజిత్ తో కలిసి గతంలో ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకొని స్టార్ డైరెక్టర్గా పేరుపొందారు తమిళ ఇండస్ట్రీలో. దీంతో ఇలాంటి సమయంలో వినోద్ కుమార్ డైరెక్షన్లో కమల్ హాసన్ మూవీ అంటే చాలా స్పెషల్ గా ఉంటుందని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో విలక్షణమైన నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కమలహాసన్ విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి ఒక నెగటివ్ పాత్రలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు.ఇక విక్రమ్ సినిమా సక్సెస్ లో విజయ్ సేతుపతి ఒక భాగమయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అందుచేతను విజయ్ సేతుపతితో మరొకసారి కలసి కమలహాసన్ నటిస్తున్నట్లుగా సమాచారం. వినోద్ చెప్పిన కథతో ఒక కీలకమైన పాత్ర ఆసక్తికరంగా ఉందని ఆ పాత్రకు విలన్ గా విజయ్ సేతుపతి అయితే బాగుంటుందని కమలహాసన్ భావించినట్లు సమాచారం. దీంతో డైరెక్టర్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరి ఆలోచనలు ఒకటేగా ఉండడంతో విజయ్ సేతుపతిని తమ సినిమాలో తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: