హాస్పిటల్ లో చేరిన నాగశౌర్య..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. నాగ శౌర్య ,  వెంకీ కుడుముల దర్శకత్వం లో తెరకెక్కిన ఛలో మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో నాగ శౌర్య సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రిందా విహరి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాప్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభించాయి. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే ఒక మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాగ శౌర్య ప్రస్తుతం కూడా సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా నాగ శౌర్య అస్వస్థతకు గురి కావడం వల్ల ఆసుపత్రిలో చేరాడు. తాజాగా నాగ శౌర్య షూటింగ్ లో సొమ్మసిల్లి పడిపోయాడు. దానితో వెంటనే నాగ శౌర్య ను గచ్చిబౌలి ఏ ఐ జి ఆస్పత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే నాగ శౌర్య కు తాజాగా పెళ్లి కూడా కుదిరింది. ఈ నెల 20 వ తేదీన నాగ శౌర్య పెళ్లి జరగాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: