ఆశిష్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన విశ్వక్ సేన్ హీరోయిన్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి ఆశిష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన రౌడీ బాయ్స్ మూవీ తో ఆశిష్ వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , ఆశిష్ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన రౌడీ బాయ్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ గుర్తింపు ను దక్కించుకున్న ఈ హీరో ప్రస్తుతం సెల్ఫిష్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా కాలమే అవుతుంది.  ఈ మూవీ కి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణ మూవీ లో రెండవ హీరోయిన్ గ నటించిన రితిక నాయక్ "సెల్ఫిష్" మూవీ లో అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా  నటించబోతున్నట్లు , ఎందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రానున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతుంది. ఈ వార్త కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇది ఇలా ఉంటే అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ద్వారా రితిక నాయక్ కు మంచి గుర్తింపు లభించింది. అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ నటన కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: