షాక్:నాలాగా ఇతర హీరోయిన్లు ఉండలేరంటున్న రాధిక ఆప్టే..!!

Divya
బాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్గా పేరుపొందింది రాధిక ఆప్టే. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ముఖ్యంగా రక్త చరిత్ర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక అంతే కాకుండా ఎప్పుడూ బోల్డ్ క్యారెక్టర్లలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. దీంతో నిత్యం ఏదో ఒక వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది హీరోయిన్లు సర్జరీ ల పైన తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది రాధిక ఆప్టే. వాటి గురించి తెలుసుకుందాం.
రాధిక ఆప్టే తాజాగా నటించిన మోనిక ఓ మై డార్లింగ్.. చిత్రంలో హీరోగా రాజ్ కుమార్ రావు నటించారు ఈ చిత్రంలో రాధిక ఆప్టేతో పాటు హూయ ఖురేషి కూడా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం కామెడీ క్రైమ్ మిత్రులారా తెరకెక్కించారు డైరెక్టర్ వాసన బాల. నవంబర్ 11వ తేదీ నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్  కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ రాధిక ఆప్టే పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. బాలీవుడ్లో పున్ ఏజ్ విజన్ పై  పలు అవకాశాల కోసం అందం కోసం హీరోయిన్లు సర్జరీ చేయించుకుంటారు అంటూ వ్యాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీలో వరుస అవకాశాల కోసం కంటిన్యూ కావడం కోసం ఎంతోమంది సమకాలిన నటీమణులు తమ ముఖాలను బాడీలను మార్చుకోవడం కోసం సర్జరీ చేయించుకున్నారు. కానీ తాను మాత్రం ఏనాడు అందంగా కనిపించాలని సర్జరీ చేయించుకోలేదని తెలియజేసింది. ఇక తాను కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. సర్జరీల కన్నా.. బలమైన కథ కంటెంట్ ఉంటేనే సినిమాలను నటించడానికి ఒప్పుకుంటానని తెలిపింది. ఇక తనలాగా సర్జరీ లేకుండా ఏ హీరోయిన్లు ఉండలేరని తెలియజేసినట్లు సమాచారం.గతంలో కూడా ఇదే తరహాలో ఈ ముద్దుగుమ్మ స్పందించడంతో పలు వివాదంగా మారింది.. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: