వెంకట్ ప్రభు మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్న నాగచైతన్య..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాకు చైతన్య "జోష్" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఎన్ సి 22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఒక ప్రత్యేక సెట్ లో భారీ యాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల్లో ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న అరవింద్ స్వామి , శరత్ కుమార్ లు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించ బోతున్నట్లు ,  ఈ పాత్ర అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం ఈ మూవీ తో పాటు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో తేరకేక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్య డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: