భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న నాగచైతన్య..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నాగ చైతన్య ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు.  నాగ చైతన్య ఈ సంవత్సరం బంగార్రాజు ,  థాంక్యూ , లాల్ సింగ్ చడ్డ అనే మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించగా , ఈ మూడు మూవీ లలో బంగార్రాజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య , వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నాగ చైతన్య కు కెరియర్ పరంగా 22 వ మూవీ. ఈ మూవీ లో కృతి శెట్టి నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు బంగార్రాజు మూవీ తెరకెక్కి , మంచి విజయం సాధించింది.

దానితో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఇళయరాజా ,  యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా ,  అరవింద్ స్వామి ,  శరత్ కుమార్ లు ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ లో మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ యాక్షన్స్ సన్ని వేషాలలో అక్కినేని నాగ చైతన్య తో పాటు అరవింద్ స్వామి , శరత్ కుమార్ లు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సన్నివేశాలను భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: