విశాల్ లాఠీ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేస్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాల్ ఇప్పటికే అనేక తమిళ మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా విశాల్ ఎప్పటికప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే విశాల్ తన పందెం కోడి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే విశాల్ తను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ ల ద్వారా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ "లాఠీ" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అదిరిపోయి అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల ఈవెంట్ ను 13 నవంబర్ 2022 వ తేదీన "జే ఆర్ సి" కన్వెన్షన్ హాల్ లో  నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి ఏ వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: