చరణ్‌ సినిమాల ఆలస్యం.. మెగా అభిమానుల నైరాశ్యం...!!!

murali krishna
ఒకప్పుడు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు రిలీజ్‌ చేసేవాళ్లు స్టార్‌ హీరోలు. కాలం మారి ఇప్పటి బడా హీరోలు ఏడాదికి ఒక మూవీ చేయడమే గొప్పయిపోయింది.ప్రాజెక్టుల స్కోప్‌, బడ్జెట్‌ పెరగడం ఓ కారణమయితే, గ్రాండియర్‌ లుక్స్‌, ఎఫెక్ట్స్‌ అంటూ ఆడియెన్స్‌ ని థ్రిల్‌ చేయడానికి టెక్నికల్‌ ఎలిమెంట్స్‌ తో కూడిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ టైమ్ తీసుకోవడం ఇంకో కారణం. దాంతో ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు కాస్త ఆలస్యమవుతుండడం వల్ల తమ అభిమాన హీరోను వెండితెరపై చూడాలనే అభిమానుల ఎదురుచూపులు ఇంకొన్ని రోజులు పెరగాల్సిన పరిస్థితి.
ఆ హీరోల లిస్ట్‌లో ప్రజెంట్ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు రామ్‌ చరణ్‌. త్రిబులార్‌ తో నేషనల్ వైడ్‌ గా తన రేంజ్‌ అండ్ క్రేజ్‌ పెంచుకున్నా, వెంటనే ఆచార్య సినిమాతో డిజాస్టర్‌ని టేస్ట్‌ చేశాడు. దాంతో అప్‌ కమింగ్‌ బ్లాక్‌ బస్టర్స్‌తో ఆడియెన్స్‌ ను అలరిస్తాడని ఫ్యాన్స్‌ తెగ ఈగర్‌ గా వెయిట్ చేస్తుంటే చరణ్‌ మాత్రం ఇంతా ఇంతా ఆలస్యం చేస్తున్నాడు. అఫ్‌ కోర్స్‌… ఆ లేట్‌ కూడా చరణ్‌ కావాలని చేస్తుందేమీ కాదు.
శంకర్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సౌత్‌ వైడ్‌ గా భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్‌ గా ఈ మూవీకి సంబంధించిన కొన్ని పిక్స్‌ కూడా లీకయ్‌ సోషల్మీడియాలో వైరల్‌ గా మారాయి.ఆ పిక్స్‌లో చరణ్‌ లుక్స్‌ చూశాక సినిమాలో పీరియాడికల్‌ సీన్స్‌ కూడా ఉన్నాయన్న క్లారిటీ అయితే వచ్చింది. అంతా బానే ఉంది కానీ.. షూటింగే నానాటికీ లేటవుతూ వస్తోంది. పర్ఫెక్షన్‌ కోసం డైరెక్టర్‌ శంకర్‌ పరితపించడం ఓ కారణమయితే, మరోవైపు భారతీయుడు పార్ట్‌ టూ తో శంకర్‌ బిజీగా ఉండడం మరో కారణం. శంకర్‌ ఈ ఒక్క మూవీపైనే కాంసంట్రేట్‌ చేసుంటే ఈ పాటికి కాకపోయినా ఇంకొన్ని రోజుల్లో అయినా విడుదలకి రెడీ అయేది సినిమా. కానీ సిచ్యుయేషన్‌ చూస్తుంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్‌ డిలే అవుతుందనే సింప్టమ్సే కనిపిస్తున్నాయి.
ఇక జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్లో ఓ సినిమా రానుందని చాలారోజుల్నుంచీ వార్తలు వినొస్తున్నా అఫీషియల్‌ అప్‌ డేట్స్‌ మాత్రం రాలేదు. కథని పూర్తిగా సిద్ధం చేస్తున్నారనీ, ఇంకొన్ని సిట్టింగ్స్‌ జరగాల్సి ఉందనీ చాలా రకాల గాసిప్స్‌ వినిపించినా ఆ ప్రాజెక్ట్‌ ఇక లేదనే క్లారిటీ వచ్చేసిందనేది లేటెస్ట్‌ టాక్‌. సో.. వస్తుందనుకున్న ఆ సినిమా కూడా రానట్టే. దాంతో మెగా పవర్‌ స్టార్‌ ని మళ్లీ కొత్త సినిమాతో ఎప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ పై చూసి మురిసిపోతామని హార్డ్ కోర్‌ అభిమానులు వర్రీ అవుతున్నారు.పోనీ ప్యారలాల్‌ గా మరో ప్రాజెక్ట్‌ సెట్స్‌ పై ఉన్నా ఫ్యాన్స్‌ ఓ మూవీ కోసం కాకపోయినా మరో మూవీ కోసమయినా వెయిట్‌ చేస్తుంటారు. కానీ సెట్స్‌ పై ఉన్న సినిమా లేటవుతూ, అనౌన్సవుతుందన్న సినిమా ఆగిపోవడం వల్ల మెగా ఫ్యాన్స్‌ కాస్త డిజప్పాయింట్‌ గానే ఉన్నారు. మరి అభిమానుల కోసమయినా, సినిమాల్లో స్పీడు పెంచేసి, త్రిబులార్‌ తో పెరిగిన క్రేజ్‌ అండ్ రేంజ్‌ ని చరణ్‌ సక్సెస్ ఫుల్‌ గా కంటిన్యూ చేస్తాడేమో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: