సినిమాల్లోకి రావడానికి ముందు అనుష్క ఏం చేసేదో తెలుసా?

Satvika
అనుష్క పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు... సూపర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది..ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుస సినిమాలలో నటించే ఛాన్స్ ను అందుకుంది..టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే మొన్నటివరకు వినిపించిన పేరు అనుష్క. బాహుబలి వరకు అనుష్క తెలుగులో టాప్ హీరోయిన్.ఆ తర్వాత ఆమె చేసిన లు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. దాంతో అనుష్క లకు చిన్న గ్యాప్ ఇచ్చారు. సూపర్ తో హీరోయిన్ గా పరిచయమైన అనుష్క ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది.

ఆమె నటించిన అరుంధతి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అనుష్కకు స్టార్ డమ్ వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల ల్లో ఛాన్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యింది. అనుష్క నటించిన రుద్రమదేవి, బాహుబలి లు ఆమెను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. అనుష్క చివరిగా నటించిన నిశ్శబ్దం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.తాజాగా అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా నుంచి ఫస్ట్  లుక్ రిలీజ్ చేశారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ లో హీరోగా నటిస్తున్నాడు.

అయితే తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ అనుష్క ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ అమ్మడు హీరోయిన్ కాకముందు ఎం చేసేదో అందరికి తెలిసే ఉంటుంది. అనుష్క సినిమాల్లో  కి రావటానికి ముందు యోగ టీచర్.. నేను యోగా టీచర్‌నని అందరికి తెలుసు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను మూడో తరగతి పిల్లల వరకు స్కూల్ లో పాఠాలు చెప్పేదాన్ని, దాంతో పాటు యోగా క్లాస్ లు తీసుకునేదాన్ని అని అనుష్క చెప్పుకొచ్చింది... మొత్తానికి ఈ అందమైన టీచరమ్మ సినిమాల్లో బిజీ అవ్వనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: