5 రోజుల్లో "ఊర్వశివో రాక్షసివో" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటువంటి అల్లు శిరీష్ తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అను ఇమాన్యుయల్ అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో వీరిద్దరీ కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ కి రాకేష్ శశి దర్శకత్వం వహించగా ,  సునీల్ , వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ నవంబర్ 4 వ తేదీన మంచి అంచనాలను మా ధియేటర్ లలో విడుదల అయింది.

ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం : 77 లక్షలు .
సీడెడ్ : 26 లక్షలు .
యు ఏ : 30 లక్షలు .
ఈస్ట్ : 19 లక్షలు .
వెస్ట్ : 11 లక్షలు .
గుంటూర్ : 15 లక్షలు .
కృష్ణ : 17 లక్షలు .
నెల్లూర్ : 9 లక్షలు .
5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊర్వశివో రాక్షసివో మూవీ 2.04 కోట్ల షేర్ , 3.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా ,  ఓవర్ సీస్ లో కలిపి ఊర్వశివో రాక్షసివో మూవీ 32 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఊర్వశివో రాక్షసివో మూవీ 2.36 కోట్ల షేర్ , 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: