"బ్రహ్మాస్త్ర 2" లో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ పాత్రల ద్వారా విజయ్ దేవరకొండ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో భారీ క్రేజ్ దక్కలేదు. ఇది ఇలా ఉంటే అలాంటి సమయం లోనే విజయ్ దేవరకొండ , తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి చూపులు మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయ్యి , ప్రేక్షకులను మరియు విమర్శకులను మెప్పించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఈ మూవీ తో విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం మూవీ లు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో విజయ్ దేవరకొండ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది. ఇలా ఉంటే కొంత కాలం క్రితమే విజయ్ దేవరకొండ "లైగర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బ్రహ్మాస్త్ర అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూడు భాగాలుగా విడుదల కాబోతుంది. ఈ మూవీ రెండవ భాగంలో దేవ్ అనే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వార్తలు అన్ని కూడా అవాస్తవం అని ఈ మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజాగా స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: