అదిరిపోయే మూవీ లైనప్ ని సెట్ చేసుకున్న కార్తీ..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కార్తీ ఇప్పటికే అనేక విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" మూవీ లో హీరోగా నటించాడు. ఈ మావి తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సర్దార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్ లను ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి , బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఇది ఇలా ఉంటే కార్తీ తన తదుపరి మూవీ లను కూడా అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నాడు. కార్తీ నటించబోయే తదుపరి మూవీ ల గురించి తెలుసుకుందాం.


కార్తీ తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి కొన్ని రోజుల్లోనే కొన్ని  పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "జపాన్" అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ లో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాజు మురుగన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ ఇప్పటికే ఖైదీ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్న అందరికీ తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే కార్తి ఖైదీ 2 మూవీ ని కూడా ప్రారంభించబోతున్నాడు. వీటితో పాటు కార్తీ మరి కొన్ని రోజుల్లోనే సర్దార్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నాడు. ఇలా కార్తి ఇప్పటికే కార్తీ నాలుగు మూవీ ల లైనప్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు. ఈ నాలుగు మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: