మణిరత్నం దర్శకత్వంలో నటించబోతున్న కమల్ హాసన్..?

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో ఎన్నో నటన ప్రధాన్యత కలిగిన మూవీ లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ "విక్రమ్" అనే మూవీ లో హీరోగా నటించి , బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. విక్రమ్ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. విజయ్ సేతుపతి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ,  సూర్య ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు.

విక్రమ్ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ద్వారా కమల్ హాసన్ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ మరి కొన్ని రోజుల్లో గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం తాజాగా పోన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ దర్శకుడు మరి కొన్ని రోజుల్లో పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నాడు.

ఈ మూవీ విడుదల తర్వాత కమల్ హాసన్ , మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గ్రేట్ ఆర్టిస్ట్ అయినటు వంటి కమల్ హాసన్ గ్రేట్ డైరెక్టర్ అయినటు వంటి మణిరత్నం కాంబినేషన్ లో మూవీ తెరకెక్కబోతుంది అనే వార్త బయటకు రావడం తోనే ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: