అన్విత శెట్టిగా మారిన అనుష్క శెట్టి !

Seetha Sailaja
‘బాహుబలి’ తరువాత జాతీయ స్థాయి గుర్తింపు అనుష్క కు వచ్చినప్పటికీ ఆ స్థాయికి తగ్గ మూవీ ఆమెకు ఇంతవరకు రాలేదు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను చేయాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె ప్రయత్నాలకు తగ్గట్టుగా సరైన సక్సస్ లు ఆమెకు రావడం లేదు. దీనికితోడు యంగ్ హీరోయిన్స్ రస్మిక పూజా హెగ్డే ల మ్యానియా తారా స్థాయికి చేరుకోవడంతో అనుష్క యంగ్ హీరోయిన్స్ కు పోటీగా నిలబడలేక పోతోంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా అనుష్క కొత్త సినిమాలు ఏమి ఒప్పుకోవడం లేదు. దీనికి సంబంధించి అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చినా వాటిని పట్టించుకోకుండా అనుష్క సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో నవీన్ పోలి శెట్టితో ఒక సినిమా చేస్తోంది అని వార్తలు వచ్చినప్పటికీ దానిపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆసినిమా కూడ ఆగిపోయింది అని అనుకున్నారు అంతా.

ఇటువంటి పరిస్థితులలో అందరి ఊహలకు చెక్ పెడుతూ అనుష్క చెఫ్ గా మారి అన్వితా శెట్టి పాత్రలో వంట చేస్తున్న ఒక స్టిల్ ఒకటి ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

తనకంటే వయసులో  చిన్న వాడిన నవీన్ పోలిశెట్టి ని ప్రేమించే పాత్ర అనుష్క ది అంటున్నారు. ఈసినిమా కథ కొంతమేర దసరా కు విడుదలైన ‘స్వాతిముత్యం’ మూవీ కథను పోలి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఎటువంటి ప్రచారం లేకుండా ప్రారంభం అయిన ఈమూవీ షూటింగ్ సగ భాగం పూర్తి అయిందని వీలైనంత త్వరగా ఈమూవీ షూట్ ను పూర్తి చేసి సమ్మర్ రేస్ కు విడుదల చేయాలనీ ఈమూవీ నిర్మాతల ఆలోచన అని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో డిఫరెంట్ కథలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈమూవీ కూడ అదే జాబితాలో చేరుతుందని అనుష్క నమ్మకం. మరి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: