అల్లు శిరీష్ కు శాపంగా మారిన బ్రహ్మాస్త్ర !

Seetha Sailaja
అల్లు శిరీష్ సంవత్సరాల తరబడి వేచి చూస్తే రాకరాక ఒక హిట్ వచ్చింది. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా బాగుంది అంటూ పాజిటివ్ టాక్ తో పాటు ఆమూవీ చూసిన సగటు ప్రేక్షకుడు కూడ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ ఈసినిమాకు వస్తున్న కలక్షన్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి. వాస్తవానికి పోటీ విడుదలైన 10 చిన్న సినిమాల టాక్ ముందు అల్లు శిరీష్ సినిమాకు మాత్రమే మంచి టాక్ వచ్చింది.

మేర్లపాక గాంధీ సంతోష్ శోభన్ తో తీసిన ‘లైక్ షేర్ సబస్క్రైబ్’ తో పాటు నందు హీరోగా వచ్చిన ‘బొమ్మ బ్లాక్ బష్టర్’ తో పాటు అనేక చిన్న సినిమాలు గత శుక్రు వారం విడుదలైనట్లుగా సినిమాల పై మోజున్న ప్రేక్షకులకు కూడ తెలియని పరిస్థితి. అల్లు శిరీష్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్స్ లేకపోవడానికి గల కారణం ‘బ్రహ్మస్త్ర’ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ మూవీలు అని అంటున్నారు.

ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ఓటీటీ లో గత శుక్రు వారం నుండి అమెజాన్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. వాస్తవానికి ఈ రెండు సినిమాలు ధియేటర్లలో విడుదల అయినప్పుడు సగటు ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటీటీ లో విడుదల అవ్వడంతో ఓటీటీ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను వరసపెట్టి చూస్తూ ఈ వీకెండ్ ను గడిపేయడంతో అల్లు శిరీష్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీని ఎవరు పట్టించుకోక పోవడంతో కలక్షన్స్ రాలేదు అన్న ప్రచారం జరుగుతోంది.

దీనికితోడు ఆదివారం టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఇండియా జింబాబ్వే తో కీలక మ్యాచ్ ఆడటంతో చాలామంది టివీ లకు అతుక్కుపోయి గత శుక్రు వారం వచ్చిన సినిమాల విషయమే మర్చిపోయారు. ఇలా అనేక కారణాలు శిరీష్ కు హిట్ వచ్చినా కలక్షన్స్ రాకుండా అడ్డుపడ్డాయి..    మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: