పొన్నియన్ సెల్వన్ -2 సినిమా రిలీజ్ డేట్ లాక్..!!

Divya
లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం చాలా సంవత్సరాల తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటీనటులుగా విక్రమ్, కార్తి త్రిష, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్య లక్ష్మి ,జయం రవి తదితరులు ఈ సినిమాల కీలకమైన పాత్రలో నటించారు. సెప్టెంబర్ 30వ తేదీన గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా తమిళనాడు లో మంచి విజయం అందుకుంది. విడుదలైన పలు భాషలలో కూడా పర్వాలేదు అనిపించుకుంది ఈ చిత్రం. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా రూ.460 కోట్లకు పైగా వసూలు సాధించినట్లుగా నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ps-1 సినిమా అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది.

ఇక ఈ సినిమా రెండవ భాగాన్ని కూడా మణిరత్నం తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే విడుదల తేదీని ప్రకటించడంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది. వచ్చేయేడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే విషయం సోషల్ మీడియాలోనూ పలు చర్చనీ అంశంకు దారితీస్తోంది. దీంతో త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాని మణిరత్నం తెరకెక్కించారు.

లైకా ప్రొడక్షన్ తో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. తమిళ బాహుబలి చిత్రంగా ముద్రపడిన ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే కోలీవుడ్ లో కూడా కలెక్షన్ బాగానే రాబట్టింది. తెలుగులో కూడా మొదట పెద్దగా ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్ల పరంగా భాగాన్ని రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ ,ప్రకాష్ రాజ్  తదితర పాన్ ఇండియా నటులు ఉండడం చేత హిందీలో కూడా ఈ సినిమా బాగానే కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ps -2 కు సంబంధించి ఈ అప్డేట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: