కొడుకుని నిలబెట్టిన తండ్రి..!

Divya
గత కొంతకాలం నుంచి అల్లు శిరీష్ ను అల్లు అరవింద్ పట్టించుకోవడంలేదని.. అందుకే అల్లు శిరీష్ గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వార్తలు జోరుగా సాగాయి. ముఖ్యంగా టాలీవుడ్ హీరోల్లో అల్లు శిరీష్ కెరియర్ ప్రారంభం నుంచి ప్రత్యేకమైన కథలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోని పరాజయాలు ఎదురైనప్పటికీ అదేవిధంగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాడు. అలా గౌరవం చిత్రంతో హీరోగా లాంచ్ అయిన శిరీష్ కొత్తజంట , శ్రీరస్తు శుభమస్తు , ఒక్కక్షణం, ఏబిసిడి చిత్రాలలో నటించాడు. ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో వంటి రొమాంటిక్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్ ఈ సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు.

ఇందులో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. నవంబర్ 4వ తేదీన థియేటర్లో విడుదలైన ఈ సినిమా యూత్ ఫుల్ కంటెంట్ కావడంతో మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో రొమాంటిక్,  కామెడీ సరి సమానంగా ఉండడం వల్లే యువత బాగా ఆసక్తి కనబరిస్తున్నారు . ట్రెండు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదయ్యేలా కనిపిస్తోంది . ఈ సినిమాతో అల్లు శిరీష్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా హిట్ అయితే అల్లు శిరీష్ ఖాతాలో కమర్షియల్ హిట్ ఒకటి పడబోతోందని చెప్పవచ్చు.  ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..కొత్తజంట,  శ్రీరస్తు శుభమస్తు , ఊర్వశివో రాక్షసివో ఈ మూడు చిత్రాలు కూడా అల్లు వారి గీత ఆర్ట్స్ లో రూపొందినవే . బయట బ్యానర్స్ లో  చేసిన చిత్రాలు శిరీష్ కు సక్సెస్ అందించలేదు. కానీ తమ బ్యానర్లో చేసిన మూవీస్ మాత్రం హీరోగా నిలబెట్టాయి.

ఇప్పుడు రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లు శిరీష్ తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు.. ఈ క్రమంలోనే తన కొడుకుని నిలబెట్టే ప్రయత్నం చేశారు.  పెద్ద సినిమాలను విడుదలైన తర్వాత మంచి సమయం చూసుకొని థియేటర్లలోకి తీసుకొచ్చారు.  అంతేకాదు నందమూరి బాలకృష్ణను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకొచ్చి ఒకసారిగా సినిమా పై ఊహించని అంచనాలు పెంచేశారు ఇవన్నీ అల్లు అరవింద్ గారే చేశారనేది వాస్తవం. మొత్తానికైతే కొడుకును తండ్రి నిలబెట్టారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: