ఊర్వశి రౌతెల: టాలీవుడ్ కి మరో సూపర్ ఐటమ్ బ్యూటీ?

Purushottham Vinay
ఊర్వశి రౌతెల: టాలీవుడ్  కి మరో సూపర్ ఐటమ్ బ్యూటీ?

బాలీవుడ్  హాట్  బ్యూటీ ఊర్వశి రౌతెల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సోషల్ మీడియాలో ఈమెకు అంతా ఇంత క్రేజ్  లేదు. ఆమె ఫాలోవర్లకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 60 మిలియన్ల దాకా ఫాలోవర్లు ఉన్నారంటే అసలు తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.హీరోయిన్ గా నటించిన సినిమాల కంటే బాలీవుడ్లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్సే ఆమెకు చాలా మంచి పేరు తెచ్చాయి. చాలా సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలు చేసిన ఈ హాట్  బ్యూటీ .. ఇప్పుడు తెలుగులో కొత్త ఐటెం బ్యూటీగా మారుతోంది. ఆల్రెడీ 'బ్లాక్ రోజ్' అనే సినిమాలో ఆమె చేసిన 'నా తప్పు ఏమున్నదబ్బా' సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా సూపర్ హిట్టయింది. టిక్ టాక్, ఇన్‌స్టా రీల్స్‌ను ఊపేసింది.


ఐతే ఇప్పుడు ఊర్వశి వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ అవకాశాలు అందుకుంటుండడం విశేషం. ఆల్రెడీ ఊర్వశి.. రామ్-బోయపాటి సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్‌తో కలిసి ఫొటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఈ పాటలో తాను డాన్స్  చేసిన విషయాన్ని ఆమె తెలిపింది.ఇప్పుడు ఆమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటెం పాటలో మెరవబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. మెగాస్టార్  చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం 'వాల్తేరు వీరయ్య'లో ఊర్వశి ఐటెం సాంగ్ కన్ఫమ్ అయింది. ఒక లావిష్ సెట్లో చిరు, ఊర్వశిల మీద ఈ పాట తీయడానికి దర్శకుడు బాబీ రెడీ అవుతున్నాడు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చనున్నాడు. చూస్తుంటే ఊర్వశి తెలుగులో ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌ అయ్యేలా కనిపిస్తోంది.మరి చూడాలి తెలుగు ప్రేక్షకులు ఈ బ్యూటీని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: