మల్లెమాల బిగ్ ప్లాన్.. అందుకే కొత్త యాంకర్ వచ్చిందా?

praveen
ఇటీవల జబర్దస్త్ లో కొత్త యాంకర్ వచ్చేసింది  ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ చివరికి ఈ షో నుంచి పక్కకు తప్పుకుంది. ఇక ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా ఎవరో కొత్త అమ్మాయిని తీసుకువస్తారు అని అందరూ భావించారు. ఇక కొత్త యాంకర్ రాబోతుంది అంటూ ఒక ప్రత్యేకమైన ప్రోమో కూడా విడుదల చేశారు.

ఇక ఆ కొత్త యాంకర్ ఎవరో అని బులితెర ప్రేక్షకులు వేయికళ్లతో  ఎదురుచూస్తే తీరా అక్కడ ప్రత్యక్షమైంది మాత్రం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తున్న రష్మి. ఇలా అనసూయ వెళ్ళిపోవడంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతుంది రష్మీ. దీంతో ఇక రష్మినే కంటిన్యూ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ ఇటీవల అనూహ్యంగా బుల్లితెర నటి సౌమ్యరావును యాంకర్ గా తీసుకువచ్చారు మల్లెమాల యాజమాన్యం. అయితే సౌమ్యరావును యాంకర్ గా తీసుకురావడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది అన్నది తెలుస్తుంది.

 గత రోజుల నుంచి జబర్దస్త్ రేటింగ్స్ పడిపోయాయి అంటూ టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు జబర్దస్త్ రేటింగ్స్ పెంచిన రష్మీ, సుధీర్ జోడి జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ కారణంగా రష్మీకి ఎవరితోను లవ్ ట్రాక్ తెరమీదకి తెచ్చే పరిస్థితి లేదు. దీంతో కొత్త లవ్ ట్రాక్ వర్క్ అవుట్ కావడం లేదు. తద్వారా రష్మీ ని తప్పించి ఆమె ప్లేస్ లో సౌమ్యరావు తీసుకొచ్చారు. అయితే గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది, సౌమ్య రావు మధ్య సంభాషణలు కామెడీ సృష్టించాయి. ఇక ఇప్పుడు కూడా వీరిద్దరి  మధ్య లవ్ ఉందని ఒక కొత్త ట్రాక్ తెర మీదకి తీసుకువచ్చి రేటింగ్స్ పెంచుకోవడానికి మల్లెమాల యాజమాన్యం కొత్త యాంకర్ ను తీసుకు వచ్చిందని టాక్ కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: