కాంతారా కంటే ముందే.. రిషబ్ శెట్టి తెలుగు సినిమాలో నటించాడు తెలుసా?

praveen
ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా కన్నడ మూవీ కాంతార సినిమా పేరు ఎలా మారుమోగిపోతుందో.. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించి స్వయంగా హీరోగా నటించి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రిషబ్ షెట్టి పేరు కూడా అదే రీతిలో మారుమోగిపోతూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి పండించిన హావభావాలు చూసి అందరూ మంత్రముగ్దులు  అవుతున్నారు అని చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ సినిమా ఏకంగా 200 కోట్ల వసూళ్ల వరకు దూసుకుపోయింది. 18 కోట్ల స్వల్ప బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించింది అని చెప్పాలి.

 ఎంతో తెలివిగా గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇక ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయగా భారీ లాభాలను కూడా సొంతం చేసుకున్నారు అని చెప్పాలి. అయితే రిషబ్ శెట్టి గతంలో కిరిక్ పార్టీ లాంటి సినిమాకు దర్శకత్వం వహించారు. కానీ తెలుగులో మాత్రం పెద్దగా పరిచయం లేదు. కానీ ఇప్పుడు మాత్రం కాంతారా సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా సుపరిచితుడుగా మారిపోయాడు రిషబ్ శెట్టి. కానీ రిషబ్ శెట్టి ఇక కాంతార సినిమాకు ముందే నేరుగా ఒక తెలుగు సినిమాలో నటించాడు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అది కూడా ఎప్పుడో కొన్ని ఏళ్ల కిందట విడుదలైన సినిమా కాదు.. ఏకంగా ఈ ఏడాది విడుదలైన సినిమాలోనే రిషబ్ శెట్టి ఒక పాత్రలో కనిపించాడు.

 ఆ సినిమా ఏదో కాదు మిషన్ ఇంపాజిబుల్. ముగ్గురు బాలల ప్రధాన పాత్రల్లో తాప్సీ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ దర్శకత్వం వహించారు అన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ  ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అయితే భారీ అంచనాల మధ్య  ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టి రెండు నిమిషాలు ఉన్న ఒక చిన్న పాత్రలో కనిపించాడు. ఖలీల్ అనే ఒక చిన్న దొంగ పాత్రలో ఈ సినిమాలో రిషబ్ శెట్టి కనిపిస్తాడు. సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా నచ్చడంతో ఇక రిషబ్ శెట్టి దర్శకుడు స్వరూప్ ని అభినందించారట. ఇలా వారి మధ్య ఏర్పడిన స్నేహం కారణంగా రిషబ్ శెట్టి చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: