ధనుష్ "సార్" మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ పై అప్డేట్ ఇచ్చిన జివి ప్రకాష్ కుమార్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ధనుష్ తాను నటించిన మూవీ ల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ధనుష్ రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో తిరు మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించగా , నేనే వస్తున్నా మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అపజయం పాలు అయ్యింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ అనే మూవీvలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ధనుష్ సరసన యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సార్ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. సార్ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే సార్ మూవీ కి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా జీవి ప్రకాష్ కుమార్ ఈ మూవీ ఫస్ట్ సాంగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అనౌన్సమెంట్ అప్డేట్ ఈ వారం లోనే ఉంటుంది అని తాజాగా జీవి ప్రకాష్ కుమార్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అలాగే ఈ సాంగ్ ను స్వయంగా ధనుష్ రచించినట్లు కూడా చిత్ర బృందం తెలియజేసింది. ధనుష్ , వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సార్ మూవీ పై తెలుగు , తమిళ ఇండస్ట్రీ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: