జయం నీడలో అహింస !

Seetha Sailaja
20 సంవత్సరాల క్రితం తేజా నితిన్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘జయం’ మూవీ చేసాడు. ఆమూవీ ఆరోజులలో బ్లాక్ బష్టర్ హిట్. ప్రస్తుతం తేజా తీస్తున్న సినిమాలు జనం చూడటంలేదు. నేటితరం అభిరుచులకు తగ్గట్టుగా తేజా సినిమాలు తీయలేకపోతున్నాడు అన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈవిమర్శలను తేజా పట్టించుకోడు.

అలాంటి తేజాని నమ్మి సురేష్ బాబు తన చిన్నకొడుకు అభిరామ్ తో సినిమా చేసే అవకాశం తేజాకు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ మూవీని ప్రమోట్ చేస్తూ తేజా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిరామ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. దగ్గుబాటి కుటుంబం నుండి అభిరామ్ ను డెబ్యూ హీరో అంటూ మీడియా అతడికి ఒక ట్యాగ్ ను ఇవ్వడం తనకు నచ్చలేదని కామెంట్స్ చేసాడు.

అభిరామ్ తన సినిమాలో హీరో కాదని తన కథలో ఉన్న 20 కేరెక్టర్స్ లో అభిరామ్ ఒకడు అంటూ కామెంట్ చేసాడు. తాను ఉదయ్ కిరణ్ ని అదేవిధంగా నితిన్ ను పరిచయం చేస్తున్నప్పుడు తానేమైనా గొప్పగా చెప్పానా అంటూ అలాంటి సాదాసీదా వ్యక్తిగానే తాను అభిరామ్ ను చూశానని తన హీరోలకు ఎటువంటి ప్రాముఖ్యత తాను ఇవ్వనని తన సినిమాలలో హీరో ఒక పాత్ర మాత్రమే అని కామెంట్ చేసాడు.

ఇదే సందర్భంలో ‘అహింస’ ఈ మూవీ తాను గతంలో తీసిన ‘జయం’ మూవీ ఛాయలతో ఉంటుంది అని జరుగుతున్న ప్రచారం పై తేజా స్పందిస్తూ ప్రపంచంలో ఏ భాషలో చూసుకున్నా 14 కథలు మాత్రమే ఉంటాయని ఎంత గొప్ప రచయిత దర్శకుడు అయినా ఆ 14 కథలే మళ్ళీ కథగా వ్రాస్తాడని కొత్త కథలు ఎవరు వ్రాయగలరు అంటూ ప్రశ్నిస్తున్నాడు. ‘అహింస’ సినిమాలో 16 యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అన్ని ఉంటాయని ఇది మాస్ మసాలా మూవీ అని చెపుతున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: