బాత్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేదాన్ని... అదితి రావు హైదరి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదితి రావు హైదరి , సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన సమ్మోహనం మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు ను దక్కించుకుంది. సమ్మోహనం మూవీ ద్వారా అదితి రావు హైదరి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. సమ్మోహనం మూవీ తర్వాత అదితి రావు హైదరి ,  నాని మరియు సుధీర్ బాబు హీరో లుగా తెరకెక్కిన "వి" మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ థియేటర్ లలో కాకుండా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. అదితి రావు హైదరి కొంత కాలం క్రితం శర్వానంద్ మరియు సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కిన మహా సముద్రం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన మహా సముద్రం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. అదితి రావు హైదరి ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించినది తక్కువ మూవీ లే అయినప్పటికీ అద్భుతమైన క్రేజ్ ను మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అదితి రావు హైదరి తాను మూవీ లోకి రావడానికి ముందు చాలా అవమానాలను ఎదుర్కొన్నాను అని తెలియ జేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అదితి రావు హైదరి మాట్లాడుతూ ... నేను భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించాక దేశ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాను. వీటిని చూసి తమిళ దర్శకులు శారద నాకు హీరోయిన్ అవకాశం ఇచ్చారు. అయితే సినిమా విడుదల చాలా రోజులు ఆలస్యం అయ్యింది. మా అమ్మ ముందు ఏడిస్తే బాధపడుతుందని బాత్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేదాన్ని అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అదితీ రావు హైదరి చెప్పు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: