వైరల్ అవుతున్న కాజల్ వింటేజ్ లుక్...!!

murali krishna
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అభిమానులకు దీపావళి ట్రీట్ ఇచ్చింది. పండగ వేళ వింటేజ్ లుక్ లో సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిందట.
తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్లలో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా ఈ బ్యూటీ ప్రత్యేకతే వేరు. హిట్ చిత్రాల్లో, స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ తెలుగు గడ్డపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది.
 
మొదటి లాక్ డౌన్ లోనే కాజల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా 2020 అక్టోబర్ 6న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ను ముంబైలో వివాహాం చేసుకుంది. వీరి పెళ్లికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న బేబీ బాయ్ నేల్ కిచ్లుకు జన్మనిచ్చిందట.
 
ప్రెగ్రెన్సీ సందర్భంగా కాజల్ సినిమాలకు కాస్తా దూరంగా ఉండింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రుత్వ ఆనందాన్ని పొందుతోంది. తన కొడుకు ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ  అయితే అవుతున్నారు.
 
కానీ, పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ రావడంతో కాజల్ లుక్ లో భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఫేస్ లో మునుపటి అట్రాక్షన్ లేకపోయింది. రూపసౌందర్యం పూర్తిగా దెబ్బతింది. దీంతో అభిమానులు కాస్తా అప్సెట్ అయ్యారు. గతంలో ఆమె పంచుకున్న ఫొటోల్లో కాజల్ ముఖంలోని ఛేంజెస్ కు షాక్ అయ్యారట.
 
అయితే, దీపావళి సందర్భంగా కాజల్ అభిమానులకు ట్రీట్ అందించింది. శుభాకాంక్షలు తెలుపుతూ వింటేజ్ లుక్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. వైట్ చుడీదార్ లో రూపసౌందర్యాన్ని చూపిస్తూ మతిపోగొట్టింది. క్లోజప్ లో ముఖాన్ని చూపించడంతో వింటేజ్ కాజల్ లుక్ వచ్చిందంటూ అభిమానులు కామెంట్స్ కూడా పెడుతున్నారు.
 
మొన్నటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం రీఎంట్రీకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో రూపొందుతున్న 'ఇండియన్ 2' (Indian 2) చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో తెలుగులోనూ భారీగా కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుతున

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: