బుల్లితెర నటి సుహాసిని పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి..!!

murali krishna
ఎన్నిసార్లు హీరోయిన్ల డేట్స్ చూసే మేనేజర్లు, ఫిఆర్వోలు తమ పబ్బం గడుపుకోవడానికి హీరోయిన్స్ కెరియర్లను ఫణంగా పెడుతుంటారు మరీ. ముఖ్యంగా నిర్మాతలు, దర్శకులతో నేరుగా మాట్లాడటం చేయలేని వారు ఇలాంటి మేనేజర్స్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు అని మనకి తెలిసిన విషయమే.
దాంతో కొన్నిసార్లు వారి కెరియర్ కి ఈ మేనేజర్ల ద్వారా తీరని నష్టం కూడా కలుగుతుంది. ఇలాంటి కోవలోకి వచ్చే హీరోయిన్లలో వేద అలియాస్ అర్చన కూడా ఒక్కరు. ఆమె విషయంలోనూ ఇలాగే జరగడం విశేషం మరీ.
అర్చన తన రెమ్యునరేషన్ సదరు మేనేజర్స్ తో ఓపెన్ గా చెప్పేయడం తో కొంత మంది మిగతా హీరోయిన్స్ ఆమె కన్నా తక్కువకే నటిస్తామని చెప్పి అర్చన కు రావాల్సిన పాత్రలను రాకుండా చేసేవారు. ఆలా అర్చన తన కెరీర్ లో ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయింది. అదే కోవకు చెందిన మరొక నటి సుహాసిని. ఈమెను జూనియర్ సుహాసిని గా పిలుస్తారు. ఈమె స్వస్థలం నెల్లూరు కాగా అక్కడే స్కూలింగ్ వరకు పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది అంటా మరీ. అక్కడే ఇంటర్ చదివింది.
2003లో తెలుగు సినిమాల ద్వారా వెండితెరకు పరిచయం అయింది ఈ నటి. తెలుగుతో పాటు తమిళ్, భోజ్ పూరి సినిమాల్లో కూడా నటించింది సుహాసిని. తరువాత టీవీ ఆర్టిస్ట్ గా కూడా మారింది. ప్రస్తుతం సీరియల్స్ నిర్మిస్తూ, నటిస్తూ కెరీర్ స్మాల్ స్క్రీన్ పై కొనసాగిస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ - దర్శకురాలు బిఏ. జయ దర్శకత్వంలో చంటిగాడు సినిమాలో హీరోయిన్ గా మొదట నటించింది. జయ భర్త అయినా పీఆర్వో రాజు దగ్గర ఆమె సలహాలు సూచనలు తీసుకునేది ఈ నటి. ఇక మొదటి సినిమా ఓ మోస్తరు విజయం సాధించడంతో తమిళంలో ఆమెకు వరస అవకాశాలు వచ్చాయి. నాలుగు తమిళ సినిమాల్లో సైతం నటించింది సుహాసిని
ఆ తరువాత గోపిచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తే దాంట్లో కూడా హీరోయిన్ గా చేసింది సుహాసిని. ఆ తరువాత సుందరానికి తొందరెక్కువ, గుణ, ప్రేమ చరిత్ర, హైవె సందడి, కోకిల, భూకైలాస్, లక్ష్మి కళ్యాణం, పున్నమి నాగు వంటి సినిమాల్లో చిన్న చిన్న హీరోల సరసన నటించింది.
బాలకృష్ణ నటించిన పాండురంగడు చిత్రంలో బాలయ్య దేవుని పాత్రలో కనిపించే పాత్ర చేస్తే ఆయన భార్యలలో ఒకరిగా కనిపించింది. ఆ సినిమా కూడా హీరోయిన్ గా సుహాసిని కి పెద్ద హెల్ప్ అవ్వకపోగా, యువ హీరోలతో నటించే అవకాశాలు కూడా రాకుండా పోయాయి అని చెప్పొచ్చు.
దాంతో మళ్లీ తమిళ, భోజపురి చిత్రాలు చేసింది. చివరికి వయసు మీరిన హీరోలకు మాత్రమే ఆమె సూట్ అవుతుంది అనే ముద్ర పడటం తో నటుడు నాగబాబుతో కలిసి అపరంజి అనే సీరియల్ లో లీడ్ రోల్ లో నటించింది ఈ నటి. ఈ సీరియల్ 300 ఎపిసోడ్స్ వచ్చింది తనతో కలిసి ఇద్దరమ్మాయిలు సీరియల్ లో భర్త పాత్రలో నటించిన ధర్మ అనే నటుడిని వివాహం చేసుకుంది. ఇలా ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ కావాల్సిన సుహాసిని కేవలం మేనేజర్ల వల్ల కెరీర్ కోల్పోయి సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ కి వచ్చింది అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: