చీరలో పిచ్చెక్కిస్తున్న మెగాడాటర్..!!

murali krishna
మెగా డాటర్‌ నిహారిక సోషల్‌ మీడియాలో మళ్లీ యాక్టివ్‌ అయ్యింది. హీరోయిన్‌గా రిటైర్మెంట్‌గా తీసుకున్న నిహారిక మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. కానీ అసలు మజా ఇప్పుడే ఇస్తుంది. నిహారిక ఇటీవల తరచూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారుతుంది. ముఖ్యంగా ఆమె పంచుకునే హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. గ్లామర్ పరంగా కొద్ది కొద్దిగా ఓపెన్‌ అవుతుంది నిహారిక. తాజాగా చీరలో మెరిస్తూ నెటిజన్లకి కనువిందు చేస్తుంది.
 
తాజాగా చీరలో దిగిన ఫోటోలను పంచుకుంది మెగా డాటర్‌ నిహారిక. చీరకట్టులో హోయలు పోతూ దిగిన పిక్స్ ని ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా షేర్‌ చేసింది. ఇందులో చీరలో నిహారిక యమ హాట్‌గా ఉంది. ఆయా ఫోటోలు ఆమె అభిమానులను, నెటిజన్లని అలరిస్తున్నాయి.
 
అయితే దీపావళి పండుగ సందర్భంగా నిహారిక ఇలా గ్లామర్‌ విందు చేసిందని తెలుస్తుంది. దీపావళి సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీలు కలుసుకున్నారు. అల్లు అరవింద్‌ ఇంట్లో వీరంతా కలుసుకుని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిహారిక శారీలో అందంగా ముస్తాబై ఆకట్టుకుంది. అందరికంటే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ట్రెడిషనల్‌ లుక్‌లోనైనా నిహారిక అందం రెట్టింపు కావడం విశేషం. నిహారిక నటిగా సినిమాలకు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. `ఒక మనసు`, `హ్యాపీ వెడ్డింగ్`, `సూర్యకాంతం` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.దీంతోపాటు `ఓరు నాల్ల నాల్‌ పాతు సోల్రెన్‌` చిత్రంలో నటించింది. ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. దీంతో నిహారిక సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది.
 
అంతకు ముందు యాంకర్‌గానూ మెప్పించిన విషయం తెలిసిందే. మొదటగా ఆమె `ఢీ` జూనియర్ కి ఆమె యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత `ముద్దపప్పు ఆవకాయ్‌`లో నటిస్తూ నిర్మించింది. దీనికి విశేషం గుర్తింపు, పేరు తెచ్చుకుంది. `నాన్న కూచి`లోనూ నాగబాబ్ తో కలిసి నటించి మెప్పించింది. హీరోయిన్‌గా సక్సెస్‌ కాని నిహారిక డిజిటల్‌ రంగంలో మాత్రం సక్సెస్‌ అయ్యింది.
 
ఇంతలో నిహారిక పెళ్లి చేసుకుంది. చైతన్యజొన్నలగడ్డతో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత నటనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి, నిర్మాతగా బిజీఅయ్యింది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ ద్వారా వెబ్‌ సిరీస్‌ లను నిర్మిస్తుంది. ఇటీవల ఆమె `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` వెబ్‌ సిరీస్‌నిర్మించగా, విడుదలైన ఇది మంచి ఆదరణ తెచ్చుకుంది. దీంతోపాటు `హలో వరల్డ్` అనే వెబ్‌ సిరీస్‌ నిర్మించింది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: