రుద్రుడు ‘గ్లింప్స్’లో లారెన్స్ అరాచకం....!!

murali krishna
రాఘవ లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్.. ప్రస్తుతం హీరోగా, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. ఎక్కువగా హారర్ కామెడీ జానర్ లో ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు చేసి అటు హీరోగా, ఇటు దర్శకుడిగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. లారెన్స్ హీరోగా ఇప్పుడు చాలా సినిమాలు లైనప్ చేశాడు. కాంచన 3 తర్వాత మళ్లీ లారెన్స్ నుండి కొత్త సినిమా రాలేదు. ఇప్పుడు లారెన్స్ హీరోగా ‘రుద్రుడు’ అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా రుద్రుడు మేకర్స్ మూవీ నుండి ఓ యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రుద్రుడిగా లారెన్స్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ.. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో టెర్రిఫిక్ గా ప్రెజెంట్ చేయడం బాగుంది. అందులోనే ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ట్యాగ్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా ఉన్నాయి. రుద్రుడు అనే టైటిల్ కి తగ్గట్టుగానే లారెన్స్ ఆద్యంతం ఆవేశంతో రగిలిపోతున్నట్లుగా చూపించడం విశేషం.
ఈ గ్లింప్స్ చూస్తే సినిమా కాంచనలా ఉండబోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్లింప్స్ లో హీరోయిన్ లుక్ రివీల్ చేయలేదు. కానీ.. లారెన్స్ కళ్లలో ఉన్న ఇంటెన్సిటీని బాగా క్యాచ్ చేశారు. మొత్తానికి ముప్పై సెకండ్ల గ్లింప్స్ తోనే రుద్రుడు మూవీపై అంచనాలు పెంచేశారు మేకర్స్. అయితే.. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రుద్రుడు సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. చూడాలి మరి రుద్రుడు బాక్సాఫీస్ దగ్గర ఎలా విజృంభిస్తాడో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: