నడుమందాలతో అలరిస్తున్న కృతి శెట్టి..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ చేస్తూ ఉంటారు. కానీలో వారిలో కొంత మందికి మాత్రమే మొదటి మూవీ తోనే మంచి విజయం ... మంచి క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో లభిస్తుంటాయి. అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు.
 

ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఉప్పెన మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన క్రేజ్ ను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీసుకువచ్చింది.
 

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే కృతి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వరస అవకాశాలు లభిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కృతి శెట్టి అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇప్పటికే కృతి శెట్టి ఈ సంవత్సరం నాలుగు తెలుగు మూవీ లతో ప్రేక్షకులను అలరించింది.
 

ఈ సంవత్సరం మొదట కృతి శెట్టి "బంగార్రాజు" మూవీ తో ప్రేక్షకులను అలరించగా ,  ఆ తర్వాత ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి శెట్టి , నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా పరస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న కృతి శెట్టి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి ,  తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: