5 భాషల్లో ఐదుగురు హీరోలతో విడుదల కానున్న సమంత "యశోద" మూవీ ట్రైలర్..!

Pulgam Srinivas
దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులలో ఒకరు అయిన సమంత ప్రస్తుతం యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఉన్ని ముకుందన్ ,  వరలక్ష్మి శరత్ కుమార్ ,  రావు రమేష్ , మురళి శర్మ ముఖ్య పాత్రలలో నటిస్తూ ఉండగా , హరి శంకర్ , హరీష్ నారాయణ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. నవంబర్ 11 వ తేదీన తెలుగు ,  తమిళ ,  కన్నడ ,  మలయాళం , హిందీ భాషల్లో యశోద మూవీ ని విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను అక్టోబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో ఒకే సమయంలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ మూవీ  ట్రైలర్ ను ఒక్కో భాషలో ఒక్కో హీరో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది.
 

ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేయనుండగా ,  తమిళ్ ట్రైలర్ ను సూర్య విడుదల చేయనున్నాడు. మలయాళ ట్రైలర్ ను దుల్కర్ సల్మాన్ విడుదల చేయనుండగా ,  కన్నడ ట్రైలర్ ను రక్షిత్ శెట్టి విడుదల చేయనున్నాడు. హిందీ ట్రైలర్ ను వరుణ్ ధావన్ విడుదల చేయనున్నాడు. ఇలా సమంత ప్రధాన పాత్రలో తేరక్కెక్కిన యశోద మూవీ ట్రైలర్ ను 5 భాషలలో 5 అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు విడుదల చేయనున్నారు. మరి ఈ రోజు విడుదల కానున్న యశోద మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: