ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫ్యాన్ చేసిన పనికి షాక్ అయిన మంచు విష్ణు!

murali krishna
మంచు విష్ణు.. గురించి తెలుగు ఇండస్త్రీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన తన సినిమాలతో తన యాక్టింగ్ తో ఇంకా డాన్సింగ్ తో పాటు తనకున్న కామెడీ టైమింగ్ తో అందరినీ చక్కగా అలరిస్తాడు కాబట్టి అతని పేరు తెలియని వారు టాలీవుడ్ లో ఎవరు ఉండరు.
మరి మంచు విష్ణు 1981వ సంవత్సరంలో నవంబర్ 23న మోహన్ బాబు నిర్మలాదేవి దంపతులకు చెన్నైలో జన్మించాడు మంచు విష్ణు. విష్ణు కి మూడేళ్ల సంవత్సరాలు ఉండగానే మోహన్ బాబు హీరోగా నటించిన రగిలే గుండెలు సినిమాలో మోహన్ బాబుకి కొడుకుగా నటించాడు. మోహన్ బాబు విష్ణుని చెన్నైలో ఉన్న తమిళ బ్రాహ్మణ స్కూల్ అయినటువంటి పదమ శేషాద్రి బాల భవన్ హై స్కూల్లో చదివించారు. విష్ణు అక్కడ తరగతి వరకు చదువుకున్నాడు. విష్ణు కొన్ని కారణాల వల్ల వాళ్ళ కాలేజీలోనే ఇంటర్ పూర్తి చేశాడు తరువాత ఇంజనీరింగ్ చేశాడు.
ఆ తరువాత 2001లో వాళ్ళ నాన్నగారు విష్ణుని హీరోగా చూడాలని ప్రయత్నించారు. విష్ణుని హీరోగా చేయడానికి డైరెక్టర్స్ ఎవరు ముందుకు రాలేదు. ఇక 2003లో షూటింగ్ మొదలు పెట్టాడు. విష్ణు అనే మూవీ తీశాడు. ఎన్నో తెలుగు సినిమాలు చేశాడు కానీ అన్ని యావరేజ్ గాని వచ్చాయి. 2006లో సీసీ రెడ్డి గారి ఇంటికి డిన్నర్ కి వెళ్ళినప్పుడు ఆయన మనవరాలిని చూశాడు. అప్పటినుంచి వాళ్ళిద్దరూ ప్రేమించుకుని 2008 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అతనికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడ పిల్లలే.
ఇకపోతే విష్ణు లేటెస్ట్ గా ఒక మూవీ తీశాడు ఆ మూవీ పేరు జిన్నా. ఇది 21 అక్టోబర్ 2022 కి విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అవ్వకముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ తో కలిసి మూవీ గురించి చెప్పారు. నాకు నచ్చింది కాదు జనాలకు నచ్చింది ప్రేక్షకులకు నచ్చింది తీయాలని ఉద్దేశంతో ఈ జిన్నా అనే మూవీ తీశాను అని విష్ణు చెప్పారు. అక్కడ మూవీ రిలీజ్ చేయడానికి వెళ్లినప్పుడు థియేటర్ కి వెళ్ళగా ఈసారి తెలుగు సినిమాలకి గొప్ప పీరియడ్ ఉంది అని చెప్పారు. నార్త్ ఆడియన్స్ కూడా డబ్స్ సినిమాలను ఆహ్వానిస్తున్నారు అని తెలిపారు. కంటెంట్ బావుంటే విపరీతంగా చూస్తున్నారు అని అన్నారు.
మంచు విష్ణు ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ గురించి కూడా తెలిపాడు. టూ ఇయర్స్ బ్యాక్ ఆయన లండన్ కి వెళ్లినపుడు, అక్కడ ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన రాము అని ఉన్నాడని ఆయన పికప్ చేసుకోవడానికి వచ్చాడని తెలిపాడు. ఆయన ఇండియా దాటి వెళ్లినపుడు ఎక్కువగా టాక్సీ బస్ ట్రైన్ లో వెళ్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే అతనికి ఆ ప్రైవసీ ఇండియా లో లేదని బయట ఉందంటు తెలిపారు. టాక్సీ బుక్ చేయమన్నప్పుడు ఉబర్ టాక్సీ వచ్చిందన్నడూ విష్ణు.
అయితే టాక్సీ నుంచి దిగేటప్పుడు అతను ఆయన ను చూసి వావ్ బ్రో యు ఆర్ యాక్టర్ అని చెప్పడం జరిగిందట. అతను విష్ణుకు పెద్ద అభిమానిని అని ఆ టాక్సీ డ్రైవర్ మంచు విష్ణుతో చెప్పాడట. మంచు విష్ణు తన స్నేహితుడికి తెలుగులో చెబుతు వీడు ఎవడో సినిమా లో డబ్బింగ్ ఇంకా యూట్యూబ్లో చూసి ఉంటాడు అందుకే నా పేరు తెలిసి ఉంటుంది అని అనుకున్నరట.
మరీ కారు వెళ్లే పది నిమిషాలు ఆ టాక్సీ డ్రైవర్ మాట్లాడుతూనే ఉన్నడంటు ఇంకా అతనికి ఆయన సినిమాలు అన్నీ తెలుసని, సినిమాలన్నీ చూస్తానని, విష్ణు అంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్పాడట. యాక్టింగ్ కూడా బాగా చేస్తారు అని అంటున్నాడట. అయితే అది విన్న మంచి విష్ణు తన స్నేహితుడికి వీడిని ఎలా ఇరికిస్తాను చూడు అని తన స్నేహితుడికి చెప్పిన మంచి విష్ణు ఆ టాక్సీ డ్రైవర్ ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. తన సినిమాలో ఏది నీకు ఎక్కువ ఇష్టం అని అడిగాడంట అప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ తన సినిమాలు మొత్తం ఒక ఆర్డర్లో చెప్పాడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అందరికీ మంచు విష్ణు తెలిపారు.
కానీ వాడిది ఇండియా కాదు ఆహ్వానిస్తాన్ అని కూడా మంచు విష్ణు అన్నాడు. ఆయనకు బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ టచ్ లో ఉంటారు అందుకే నేను ఎక్కువ లండన్, దుబాయ్ గాని అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆహ్వానిస్తాం అని వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు టాక్సీ లలో కానీ రెస్టారెంట్లలో కానీ వీళ్లు తన దగ్గర డబ్బులు తీసుకోరు అని మంచు విష్ణు గారు ఆ ఇంటర్వ్యూలో తన అభిమాని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ఒక హీరోకి తన అభిమానులే గుర్తింపు అని కూడా తెలిపారు.
ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా మూవీ విడుదలవ్వడంతో ఆ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకొలేదు. మరి అతను మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ మీద గెలిచి ప్రేసిడెంట్ కూడా అయిన విషయం అందరికి తెలిసిందే. వాటి గురించి మాట్లాడుతూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు మంచు విష్ణు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: