నాగశౌర్య కృష్ణ వ్రిందా విహారి చిత్రంతో లాభమా నష్టమా..?

Divya
నాగశౌర్య హీరోగా, షెర్లి సేటియా హీరోయిన్ గా అనీస్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కృష్ణ వ్రిందా విహారి. ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్ బ్యానర్ పైన నిర్మించడం జరిగింది. ఈ సినిమా సెప్టెంబర్ 23న చాలా గ్రాండ్గా విడుదలైంది. మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.దీంతో ఓపెనింగ్స్ భారీగానే నమోదు చేసు కుందని సమాచారం. ఓవరాల్ గా మొదట వీకెండ్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వీకెండ్ డేస్ లో పెద్దగా రాణించలేకపోయింది. ఇక ఈ చిత్రం ఎంతటి కలెక్షన్లను రాబట్టింది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

1). నైజాం-1.70 కోట్ల రూపాయలు.
2). సీడెడ్ -36 లక్షలు.
3). ఉత్తరాంధ్ర -45 లక్షలు
4). ఈస్ట్ -32లక్షలు
5) వెస్ట్ -20 లక్షలు
6). గుంటూరు-32 లక్షలు
7). కృష్ణ-29 లక్షలు
8). నెల్లూరు -17 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.3.81 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ రూ.89 లక్షలు.
12). ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.4.70 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది.

కృష్ణ వ్రిందా విహారి చిత్రం థియే ట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.5.88 కోట్ల రూపాయలు జరగక ఈ సినిమా సక్సెస్ సాధించాలి అంటే కచ్చితంగా రూ.6 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. అయితే కొన్ని చోట్ల అడ్వాన్స్ ల రూపంలో రిలీజ్ చేయగా కాబట్టి ఏ చిత్రం టార్గెట్ రూ.5.2 కోట్ల రూపాయలు ఉంది. ఇక ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ.4.70 కోట్ల రూపాయలను రాబట్టడం జరిగిందట. దీంతో ఈ సినిమా బజార్లకు రూ.50 లక్షల రూపాయల స్వల్ప నష్టాన్ని మాత్రమే మిగిల్చింది. దీంతో ఈ సినిమా యావరేజ్ రిజల్ట్  తో సరిపెట్టుకుందని  చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ చిత్రంతో నాగశౌర్య కాస్త పరవాలేదు అనిపించుకున్నారు. మరి తన తదుపరి చిత్రాన్ని అయినా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: