రీ రిలీజ్ కు సిద్దమైన బెస్ట్ క్లాసికల్ సినిమా...!!

murali krishna
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన సినిమాలను ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ కి అనుగుణంగా మార్చి ఆ సినిమాలను మళ్లీ ప్రేక్షకులు ముందుకు అయితే తీసుకొస్తున్నారు.
ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ రావడంతో… ఇప్పుడు సినిమా నిర్మాతలు సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట.. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ మరో లెవల్ కు చేరిందట.
 
హీరో పుట్టినరోజు లేదా, ఆ హీరో సూపర్ హిట్ అయిన సినిమాలు సిల్వర్ జూబ్లీ ఈవెంట్స్ సందర్భంగా ఆ సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారట.. ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరో అందమైన ప్రేమ కథ సినిమా వచ్చి చేరుతుంది. ఆ సినిమా మరేదో కాదు 90వ దశంలో యువతను ఉర్రూతలు ఊగించిన సినిమా ప్రేమదేశం. ఈ సినిమా 1996లో విడుదలై అప్పట్లోనే ఓ సెన్సేషనల్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో వినీత్ మరియు అబ్బాస్, టబూ నటించారు.వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకులను అయితే విపరీతంగా ఆకట్టుకుంది.
 
ఈ సినిమా విడుదలై 26 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందట. ఈ సినిమా ఆ రోజుల్లో ఎంతటి ఘనవిజయం అందుకుందో మనందరికీ కూడా తెలిసిందే. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ కూడా మనం వింటూనే ఉన్నాం. ఈ సినిమా యువతరం కోరికలను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించారట  l. వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ సినిమా స్టోరీ ఇప్పటికి కూడా కొత్త సినిమా లాగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: