మన సీరియల్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా...!!

murali krishna
మనం ప్రతిరోజు టీవీలో సీరియల్స్ చూస్తూనే ఉంటాము. జెమిని, మా టీవీ, ఈటీవీ, జీ తెలుగు ఇలా ఎన్నో చానల్స్ లో ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతూనే ఉంటాయి.ఈ సీరియల్స్ లో హీరోలను చూస్తూ ఉంటాం. ఈ సీరియల్ హీరోలకు వెండితెరపై యంగ్ హీరోలకు ఉండే క్రేజ్ ఉంటుంది. అయితే ఎంతోమంది సీరియల్ హీరోల పేర్లు చాలామందికి తెలియదు. అంతేకాకుండా వారు ఏం చదువుకున్నారు అన్నది కూడా చాలామందికి తెలియదు. తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లో హీరోలు ఎవరెవరు ఎంతవరకు చదువుకున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు నుంచి గోరింటాకు సీరియల్ నిఖిల్ వరకు ఏ ఏ హీరోలు ఎంతవరకు చదువుకున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అభిషేకం సీరియల్ హీరో మధు బాబ బిటెక్ వరకు చదువుకున్నాడు. కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల ఎంబిఏ వరకు చదువుకున్నాడు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ బిఎస్సీ వరకు చదువుకున్నాడు.
విజే సన్నీ కూడా బిఎస్సీ వరకు చదువుకున్నాడు. త్రినయిని సీరియల్ హీరో చందూ గౌడ బిటెక్ వరకు చదువుకున్నాడు. గుండమ్మ సీరియల్ హీరో కల్కి రాజా ఎంబిఏ వరకు చదువుకున్నాడు. దేవత సీరియల్ హీరో అర్జున్ ఎంసిఏ వరకు చదువుకున్నాడు. రాధమ్మ కూతుళ్లు సీరియల్ హీరో గోకుల్ బిటెక్ వరకు చదువుకున్నాడు. పాపే మా జీవనజ్యోతి సీరియల్ హీరో ప్రియతమ్ చరణ్ బిటెక్ సీఎస్ఈ వరకు చదువుకున్నాడుపాపే మా జీవనజ్యోతి సీరియల్ హీరో ప్రియతమ్ చరణ్ బిటెక్ సీఎస్ఈ వరకు చదువుకున్నాడు. నెం 1 కోడలు సీరియల్ హీరో జై ధనుష్ బిఏ వరకు చదువుకున్నాడు. మౌనరాగం సీరియల్ హీరో శివ కుమార్ బిటెక్ వరకు చదువుకున్నాడు. ఆమె కథ సీరియల్ హీరో రవికృష్ణ డిగ్రీ వరకు చదువుకున్నాడు. గోరింటాకు సీరియల్ హీరో నిఖిల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: