డేంజర్‌ జోన్‌లో ఉన్నది ఎవరు...??

murali krishna
బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఇప్పుడు ఏడో వారానికి చేరుకుంది. ఈ వీకెండ్‌ షో కోసం ఎంతో ఆతురతగా చూశారు ప్రేక్షకులు.అదంతా ఆ ఎపిసోడ్‌ ప్రోమో ఎఫెక్ట్‌. ఎందుకంటే ఇంటి సభ్యుల్లో ఎవరి బెస్ట్‌.. ఎవరు వరెస్ట్‌ అన్నది తెలుస్తుందని. వారిపై నాగార్జున ఎలాంటి క్లాస్‌ తీసుకుంటారో చూడాలని వీక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూశారు. ఇంటి సభ్యుల పట్ల నాగ్‌ కాస్త కోపంగా ఉన్నట్టు కనిపించారు. కానీ ఎవరి మీద అంత కటువుగా ప్రవర్తించలేదు. అయితే ఈ వారం మొదట రేవంత్‌ బలయ్యాడు. పదే పదే పప్పు అంటూ మాటలతో హింసిస్తూనే ఉన్నారు. రేవంత్‌కి మాట్లాడే ఛాన్స్‌ కూడా ఇవ్వలేదు.
ఇక రెండో ప్రోమో చూస్తే... గత టాస్క్‌లు భాగంగా కీర్తిభట్‌ ' రాములమ్మలో విజయశాంతి క్యారెక్టర్‌ ప్రస్తావన వచ్చింది. ఆ పాత్ర విషయంలో కీర్తికి సాయం చేసిందెవరు అని నాగ్‌ అడగగా సూర్య అని చెబుతుంది కీర్తి. మరి ఇనయాకు సూర్య ఎందుకు హెల్ప్‌ చేయలేదు అని అడిగారు నాగార్జున. 'మీ టీమ్‌ వాళ్లెవరూ చెప్పలేదా నీకు' అని సూర్య అన్నాడని చెబుతుంది. 'అందుకే శ్రీహాన్‌ను పొగడడం మొదలు పెట్టావా' అంటూ నాగ్‌ నవ్వులు పూయించారు. ఆ తర్వాత ఇంట్లో మోస్ట్‌ డిజర్వింగ్‌ పర్సన్‌ ఎవరు అని అడిగారు. ఎవరు ఎవరి పేర్లు చెప్పారో చూపించలేదు. కానీ ఆసక్తిని రేకెత్తించారు. ఇంట్లో అర్హతలేని సభ్యులు ఎవరని అడిగితే ఎక్కువ మంది మెరీనా పేరు చెప్పారు. గీతూ రాయల్‌ మాత్రం 'కలిసిఆడమన్నప్పుడు విడివిడిగా ఆడారు. విడిగా ఆడమంటే కలిసి ఆడుతున్నారు అని చెప్పాంది. వందశాతం కష్టపడ్డానని, ఫలితంగా జైలుకి వెళ్లానని వాసంతి చెప్పింది. జైలుకి వెళ్లడం డిజర్వింగ్‌ అని నీ ఫీలింగా అని నాగార్జున అడిగారు. ఏం చెప్పాలో తెలియని వాసంతి అలాగే నిలబడిపోయింది. నిజం చెప్పాలంటే ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, గీతూ పెద్దగా ఆడింది లేదు. వాసంతి బాగానే ఆడింది కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టాస్క్‌లు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ వారం నామినేషన్లలో గీతూ, సూర్య తప్ప ఇంటి సభ్యులు అందూ ఉన్నారు. డేంజర్‌ జోన్‌లో ఉన్నది ఇనాయా, మెరీనా అని అర్థమవుతోంది. మెరీనాను ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: