నయనతార- విఘ్నేష్ ప్రేమకు కారణం ఆచిత్రమే..!!

Divya
కోలీవుడ్ ప్రేమ జంటగా పేరుపొందిన నయనతార, విఘ్నేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో మునిగితే వెళ్ళిన ఈ జంట ఈ ఏడాది జూన్లో ఒకటయ్యారు. తాజాగా నయనతార కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే వీరి ప్రేమ కథ ఎక్కడ ప్రారంభమైంది అసలు వీరిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు.వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నయనతార ,విగ్నేష్ దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారట.అయితే మొదటి అడుగు పడింది మాత్రం ఆ చిత్రంతోనే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం నానుమ్ రౌడీ దాస్ ఈ సినిమా ప్రేమ కథ చిత్రం. విడుదలై నేటికీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి మనం తెలుసుకుందాం.

ఇక ఈ చిత్రం కోసం మొదటిసారి విఘ్నేష్ ను నయనతార కలవడం జరిగిందట. ఇక అప్పటినుంచి వీరి లవ్ స్టోరీ ప్రారంభమయిందట.ఇక వీరిద్దరూ విడిచి వెళ్లలేని బంధంతో ఏర్పరచుకున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార మొదట ఎంపిక కాలేదట ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే అనుకోకుండా ఒక హోటల్లో నయనతారను కలవడంతో ఈ సినిమాకు హీరోయిన్గా నయనతార ఎంపిక చేస్తే బాగుంటుందని భావించి ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేశారట.
నానుమ్ రౌడీ దాస్ సినిమా విడుదల ఏడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విగ్నేష్ సెట్లో ఉన్న వీడియోను పంచుకోవడం జరిగింది. ఆ వీడియోలో విఘ్నేష్, నయనతార సముద్రం వద్ద ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. మొదట్లో వీరిద్దరూ ఏదో సీరియస్ డిస్కషన్ చేసుకున్న తర్వాత నవ్వుతూ కనిపించారు. ఇక విగ్నేష్ తన ఇంస్టాగ్రామ్ లో ఇలా షేర్ చేస్తూ ఒకప్పుడు పాండివుడ్ లో అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: