ఈ చిన్ననాటి రెండు జడల అమ్మాయి ఎవరో తెలుసా..?

murali krishna
సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు చూసేందుకు నెటిజన్లు ఈ మధ్య తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే తమ త్రో బ్యాక్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు తారలు.

అభిమానులు వాటిని ట్రెండ్ చేస్తూ.. దుమ్ములేపుతున్నారు. అలా ఇటీవలి కాలంలో పలువురు నటీనటులతో పాటు స్పోర్ట్స్ స్టార్స్, బిజినెస్ పర్సనాలిటీ ల చిన్ననాటి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఆ కోవలో ఓ బుల్లితెర ఫేమస్ పర్సనాలిటీ చైల్డ్‌హుడ్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. పోలికలు చూసి చాలామంది ఇప్పటికే ఆమె ఎవరో కనిపెట్టేసి ఉంటారు. యస్.. కరెక్ట్.. ఆమె బుల్లితెర లేడీ సూపర్ స్టార్ సుమ.
ప్రి రిలీజ్ ఫంక్షన్స్‌, ఇంటర్వ్యూలు, టీవీ షోలతో.. క్షణం కూడా తీరక లేనంత గా బిజీగా ఉందట సుమక్క. మాటలు, చలాకీతనం.. అంతకు మించిన సమయస్ఫూర్తితో ఆమె నంబర్ వన్‌గా దూసుకుపోతుంది. మాములుగా ఆమెది కేరళ అంటే ఎవరూ నమ్మరు. అంత బాగా తెలుగు మాట్లాడుతుంది. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని ఎప్పుడో తెలుగమ్మాయి అయిపోయిందిలేండి. మొదలెట్టిందంటే చాలు.. ఆమె మాటలు సాగర ప్రవాహమే. పంచులు, ప్రాసలతో రప్పాడిస్తుంది. ఎక్కడ ఫన్ చేయాలో, ఎక్కడ గమ్మనుండాలో ఆమెకు బాగా తెల్సు. లౌక్యం తెలిసిన యాంకర్.
"జయమ్మ పంచాయితీ" అనే తో చాలాకాలం తర్వాత మరోసారి వెండితెరపై మెరిసింది. ప్రజంట్ ఆమె కెరీర్ ఫుల్ జోష్‌లో సాగుతుందట.సుమ డేట్స్ దొరక్క ప్రి రిలీజ్ ఫంక్షన్ వాయిదా వేసిన స్టార్స్ సైతం ఉన్నారు. అది ఆమె రేంజ్. మొత్తంగా ఇప్పుడు సుమ అంటే ఓ పర్సన్ లేదా సెలబ్రిటీ కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్.. తాజాగా ఆమె గతంలో షేర్ చేసిన తన చిన్ననాటి ఫోటోను మరోసారి వైరల్ చేస్తున్నారట నెటిజన్లు.ఈమె చిన్ననాటి చిత్రానికి భారీ స్పందన అయితే  వస్తుంది.ఈ పిక్ ను తెగ షేర్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: