సర్దార్ సినిమాను పొగడ్తలతో ముంచేస్తున్న నటుడు నాగార్జున..!!

murali krishna
నటుడు సూర్య సోదరుడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు  నటుడు కార్తీ. ఈయనకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మనం చెప్పవచ్చు
ఊపిరి సినిమాతో పాటు ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు ఈ నటుడు. తాజాగా సర్దార్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తి. అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున  గారు హాజరయ్యాడు. కార్తీ గొప్పతనం గురించి చెబుతూ ఆయన గురించి సంచలన కామెంట్స్ చేశారు. నాగార్జున , ఈయన చేసినా కామెంట్స్ కూడా సినిమాపై  బారి అంచనాలు పెంచాయి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.
కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ 'సర్దార్' సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది మరీ. సర్దార్ చిత్రంలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటివలే విడుదలైన 'సర్దార్' టీజర్‌ కి అన్ని వర్గాల ప్రేక్షల నుండి ట్రెమండస్ రెస్పాన్స్  బాగానే వస్తోంది. టీజర్‌లో కార్తీ ఆరు విభిన్న గెటప్స్ , బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ సినిమాపై భారీ అంచనాలని పెంచింది. పిఎస్ మిత్రన్ తన అవుట్ స్టాండింగ్ తో ఆకట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ లో విడుదలౌతుంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీపై ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పరచడం జరిగింది.
 
సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ని  కూడా అందించారు. ఎప్పుడో తప్పిపోయిన తండ్రి కోసం అదే వృత్తిని ఎంచుకున్న కొడుకు సాగించే అన్వేషణే ఈ సినిమా స్టోరీ అని అందుకే దగ్గరి పోలికలు కూడా ఉంటాయని సోషల్ మీడియాలో చాలా ట్విట్లు వచ్చాయి. అయితే ఇది అస్సలు వాస్తవం కాదట. సదరు చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన రూబెన్ దీని గురించి క్లారిటీ ఇస్తూ రజనీకాంత్ విజయ్ కాంత్ ఎలా అన్నదమ్ములు కాదో ఇది కూడా అలాంటి అభూతకల్పనే తప్ప మరొకటి కాదని తేల్చేశారు. ఇక ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కార్తీ  కూడా నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తెలుగు, తమిళ్ , మళయాల భాషల్లో మంచి రెస్పాన్స్  కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: