"సర్ధార్" మూవీలో దర్శకుడు చేసిన 5 తప్పులివే ?

VAMSI
నిన్న తెలుగు తమిళ భాషలలో ప్రముఖ హీరో సూర్య తమ్ముడు కార్తీ నటించిన సర్దార్ సినిమా థియేటర్ లలో విడుదలైంది. కార్తీ తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ అంతే సమానమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కార్తీ నుండి వచ్చిన ఖాఖీ మరియు ఖైదీ చిత్రాలతో టాలీవుడ్ లోనూ మంచి డిమాండ్ ను ఏర్పరుచుకున్నాడు. సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది అని చెప్పాలి. ఇందులో కార్తీ సరసన రాశిఖన్నా మరియు రజిషా విజయన్ లు హీరోయిన్ లుగా నటించగా, అలనాటి హీరోయిన్ లైలా కీలక పాత్ర చేసింది. ఇక జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా, పి ఎస్ మిత్రన్ దర్శకత్వ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మరోసారి కార్తీ  తన నటనతో ఆకట్టుకున్నాడు అంటూ పొగుడుతున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే సర్దార్ లో కొన్ని విషయాలలో దర్శకుడు పొరబడ్డాడు అని సినిమా వర్గాలు భావిస్తున్నాయి. ఆ పొరపాట్లను అధిగమించి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని అంటున్నారు. అయితే సినిమాలో ఎక్కడ దర్శకుడు మిత్రన్ ఓవర్ లుక్ చేశారని చూద్దాం.
* దర్శకుడు తీసుకున్న పాయింట్ గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ సినేమానా అక్కడక్కడా స్లో గా సాగడంతో ప్రేక్షకులు కొన్ని చోట్ల నిరాశకు గురయినట్లు తెలుస్తుంది. ఎపుడైనా ఇలాంటి కథలో స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉంటేనే ప్రేక్షకుడు కథలో లీనం అవుతాడు.
* ఈ సినిమాలో సస్పెన్స్ లే కీలకం.. అలాంటిది ఆ సస్పెన్స్ ను గ్రిప్పింగ్ గా మలచడంలో మిత్రన్ తడబడినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ అంశాలను ఇంటరెస్టింగ్ గా చూపించలేకపోయారు.
* తమిళ సినిమాలు ఇంతకు ముందు చాలానే తెలుగులో ఏకకాలంలో రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమాలో చూసుకుంటే లిప్ సింక్, పాటలు విషయంలో నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ ఎందుకో ఈ మధ్యన తన మ్యూజిక్ టాలెంట్ కన్నా యాక్టింగ్ మీదనే శ్రద్ద చూపిస్తున్నాడు. అదే విధంగా డైరెక్టర్ లిప్ సింక్ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది.
* ముఖ్యంగా ఈ సినిమాలో రాశిఖన్నా మరియు లైలా పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా కాలం తర్వాత రి ఎంట్రీ ఇచ్చిన లైలాకు ఈ సినిమా ఏమాత్రం ఉపయాగపడదు. ఇక రాశీఖన్నాను ను ఎందుకు తీసుకున్నారో కూడా అర్దహ్మ్ కాలేదు.
* ఇందుకు కార్తీ డ్యూయల్ రోల్ చేసిన విషయం తెలిసిందే మరియు కార్తీకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది. ఏ సినిమాలో అయినా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. కానీ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో అంత పస లేదు.
ఇలా పైన చెప్పిన విషయాల పట్ల జాగ్రత్త వహించి ఉంటే సినిమా ఇంకా మంచి విజయాన్ని సాధించి ఉండేది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: