ఈ వారం హౌస్ నుంచి వెళ్ళిపోయేది ఎవరంటే?

Satvika
బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది..ఇప్పుడు ఆరో సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్కు ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం నాగర్జున ఒక హౌస్ మేట్ ని ఎలిమినేట్ చేస్తారు. అయితే ఆ షూటింగ్ అంతా శనివారం జరుగుతుంది కాబట్టి శనివారం సాయంత్రమే ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని లీక్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం లీక్ అయింది.

నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎప్పటిలానే మొదటి స్థానంలో రేవంత్ కొనసాగుతున్నాడు. అతనికి ప్రతివారం కూడా అందరికంటే ఎక్కువ స్థాయిలో ఓట్లు దక్కుతున్నాయి. ఇక అతని తర్వాత శ్రీహాన్ ఎప్పటిలోనే రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ అతనికి ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని ఓట్లు అయితే తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. ఇక అర్జున్ మూడవ స్థానంలోకి రావడం విశేషం. ఆదిత్య 4వ స్థానంలోకి వచ్చేసాడు. మొన్నటి వరకు ఆదిత్య కు చాలా తక్కువ స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఇక ఆదిరెడ్డి కూడా టాప్ 5 లో ఉండేందుకు పోటీ పడుతున్నాడు. 


అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఇప్పుడు అతను 5వ స్థానంలో ఉన్నాడు. ఇక ఫైమా ఆరు, ఏడవ స్థానంలో కీర్తి కొనసాగుతోంది.
ఇది ఇలా వుండగా కీర్తి లాస్ట్ వీక్ టాప్ ఫైవ్ లో నిలిచింది. కానీ ఈసారి మాత్రం ఆమె అనుకున్నంత స్థాయిలో ఇప్పించడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.ఇక 8వ స్థానంలో అయితే మెరీనా నిలిచింది. ఆమె భర్త రోహిత్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రోహిత్ తర్వాత 10వ స్థానంలో వాసంతి కొనసాగుతోంది. ఆమె గత రెండు వారాల క్రితం టాప్ ఫైవ్ లో నిలిచినప్పటికీ ఇప్పుడుడౌన్ అయింది. చివరి మూడు స్థానాల్లో కొనసాగుతున్న వారి వివరాల్లోకి వెళితే.. ఇనయా సుల్తానా 11వ స్థానంలో , శ్రీ సత్య 12, చివరి 13వ స్థానంలో అయితే రాజశేఖర్ కొనసాగుతున్నాడు. మరి అతను ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. చూడాలి మరి ఈ వారం ఏంఇన్ జరుగుతుందో..ఎవరూ బయటకు వెలతారో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: