విడాకులు తీసుకోబోతున్న ప్రియమణి...?

murali krishna
సినీ పరిశ్రమలోనే కాదు సాధారణ సమాజంలో కూడా ఈ ప్రేమ పెళ్లిళ్లు విడాకులు అనేవి అయితే చాలా సర్వసాధారణం అయిపోయాయి.


సినీ పరిశ్రమలో జరిగితే అది పెద్ద వార్త అవుతూ ఉంటుంది. ఇప్పటికే చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన జంటల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ప్రియమణి తన భర్త నుంచి దూరమయ్యే అవకాశాలున్నాయి అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం కూడా మొదలైంది.


తెలుగులో ఎన్టీఆర్ బాలకృష్ణ సహా పలువురు బడా హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ అనిపించుకున్న ప్రియమణి తర్వాతి కాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో కేరళకు చెందిన ముస్తఫా రాజ్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. నిజానికి ముస్తఫా రాజ్ కు అంతకుముందే పెళ్లయింది. అయినా సరే ప్రియమణి అతన్ని వివాహం చేసుకుందట.. ఈ విషయంలో అతని మొదటి భార్య నుంచి ప్రియమణికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయట.


తర్వాత ఆ పరిస్థితులు కుదుటపడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఆమె భర్తకు ప్రియమణికి సరిగా పోసగడం లేదని ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతానికి వీరిద్దరూ కలిసి కూడా నివసించడం లేదని వేరువేరుగా నివసిస్తున్నారని ప్రచారం ఊపందుకుందిట.అయితే ఇదంతా నిజం కాదని కేవలం ప్రచారం మాత్రమేనని ప్రియమణి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు పది వారాల క్రితం మాధవన్ రాకెట్రీ సినిమా సక్సెస్ పార్టీలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారని ఆ వీడియో స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.


ఇక ప్రియమణి ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. భామాకలాపం, నారప్ప వంటి సినిమాల్లో ఆమె తనదైన నటనతో ఆకట్టుకుంది. కొన్నాళ్ల క్రితం వరకు మల్లెమాల నిర్వహిస్తున్న ఢీ షోలో జడ్జిగా కూడా ఆమె పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేసింది. ఇక ప్రస్తుతానికి మరోసారి ఆమె తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఇలాంటి వార్తలు పుట్టుకు రావడం అనేది హాట్ టాపిక్ గా మారిందట  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: