కాంతార లాంటి కథ తారక రాముడు (ఎన్టీఆర్) కోసం సెట్ చేయండి బాసు.. ఫ్యాన్స్ కోరికలో న్యాయం ఉంది..!

shami
లేటెస్ట్ కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిషబ్ శెట్టి కథ, దర్శకత్వంతో పాటుగా తనే హీరోగా చేసిన కాతార సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది. అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ తెలుగులో చేస్తున్న వసూళ్లని చూసి ఆ సినిమా యూనిట్ షాక్ అవుతున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ కి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి రిస్క్ లేకుండా కొద్దిపాటి డబ్బులతో కొన్న కాతార సినిమా ద్వారా అల్లు అరవింద్ భారీగా లాభ పడుతున్నారు.
ఇక కాంతార సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ ఇలాంటి కథ మన తెలుగులో వస్తే బాగుండని అనుకుంటున్నారు. అంతేకాదు తారక రాముడు అదేనండి మన ఎన్.టి.ఆర్ కోసం ఇలాంటి ఓ అద్భుతమైన కథ సిద్ధం చేయండి అంటూ నందమూరి ఫ్యాన్స్ కోరుతున్నారు. కాంతారా ప్యూర్ రియల్ అండ్ రస్టిక్ మూవీ.. ఇలాంటి పాత్రలో తనదైన శైలిలో నట్టించడం తారక్ కి వెన్నతో పెట్టిన విద్య. ఎన్.టి.ఆర్ కోసం కాంతార లాంటి కథ వస్తే మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది.
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ తన నట విశ్వరూపం తో అలరించారు. అలాంటి ఎన్.టి.ఆర్ తో కాంతార లాంటి కథ చేస్తే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది. కాంతార లాంటి అద్భుతమైన కథలను ఎన్.టి.ఆర్ తప్పకుండ ఎంకరేజ్ చేస్తారని చెప్పొచ్చు. మరి నందమూరి ఫ్యాన్స్ కోరుతున్నట్టుగా తారక్ కోసం ఎవరైనా ఇలాంటి అరుదైన కథతో వస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: