బిగ్ బాస్ టాస్క్ లో మళ్ళీ లొల్లి...!

murali krishna
గత సీజన్ లతో పోలిస్తే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ చాలా చప్పగా సాగింది. గత రెండు వారాల్లో కొద్దిపాటి పర్ఫామెన్ల్ ఇచ్చేందుకు ఇంటి సభ్యులు ప్రయత్నించినా కూడా అంతగా వర్కౌట్ కాలేదు.


ఇక ఇటీవల బిగ్ బాస్ సినీ సెలబ్రిటీ టాస్క్ ఇవ్వగా తమ నిర్లక్ష్యంతో బిగ్ బాస్ కు ఆగ్రహం తెప్పించారు హౌజ్ మేట్స్. దీంతో వాళ్లకు పనిష్ మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఆహారం కోసం, ఇంట్లో ఉండటం కోసం పోటీలు పెట్టాడు. తాజాగా విడుదల చేసిన అక్టోబర్ 20వ తేది ఎపిసోడ్ రెండో ప్రోమోలో ఇంటి సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించుకున్నాడు బిగ్ బాస్. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ చాలా చప్పగా సాగుతోందని, అందుకే రేటింగ్ రావట్లేదని ఇప్పటికీ ఎన్నో కామెంట్లు వినిపించాయట.. అందుకు తగినట్లుగానే ఇంటి సభ్యుల ఆట తీరు నిర్లక్ష్యంగా సాగింది. ఏ టాస్క్ ఇచ్చిన కూడా ఆడకుండా ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించేవారు. కొంతమంది మాత్రమే చురుగ్గా పాల్గొనేవారు. దీంతో ఇంటి సభ్యులపై బిగ్ బాస్ కు కోపం వచ్చింది.


దీంతో బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఇంటి సభ్యులపై బిగ్ బాస్ స్ట్రైక్ చేయడం ప్రారంభించాడు. ఇన్ని రోజులుగా చేసిన వరెస్ట్ పర్ఫామెన్స్ తో విసిగిపోయిన బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు పనిష్ మెంట్ ఇస్తున్నాడు. అందులో భాగంగానే కబడ్డీ, థగ్ ఆఫ్ వార్ గేమ్స్ ఆడించాడట బిగ్ బాస్.


అందులో ఓడిపోయిన గీతూ రాయల్.. గెలుపొందిన ఆదిరెడ్డి ప్లేట్ నుంచి చిన్న ఆలు ముక్క తీసుకుని పనిష్ మెంట్ కు గురైంది. గీతూతోపాటు ఆదిరెడ్డితో అంట్లు కూడా తోమించాడు బిగ్ బాస్. అంతేకాకుండా హౌజ్ లో ఉండేందుకు ఎలిజిబిలిటీ పోటీ కూడా పెట్టాడు. తాజాగా వారితో ప్రతిజ్ఞ కూడా చేయించుకున్నాడు.


ఇప్పటివరకు మీరు చూపించిన నిరుత్సాహం పట్ల పశ్చాత్తాపం పడుతున్నట్లయితే మీ ఆటను ఎలా మార్చుకుంటారో చెప్పి.. ఈ షోలో మీ నుంచి ఏం ఆశించాలో కూడా చెప్పాల్సి ఉంటుంది అని తెలిపాడు బిగ్ బాస్. దీంతో అందరూ ప్రమాణాలు చేయడం ప్రారంభించారు. అలాగే వారి ఆట తీరు ఎలా ఉంటుందో కూడా చెప్పుకొచ్చారట.


ఆ తర్వాత టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈసారి టాస్క్ లో ముఖ ద్వారం నుంచి బొమ్మలు వస్తాయి. వాటిని పట్టుకెళ్లి తమ టీమ్ కు కేటాయించిన కంటేనర్ లో పెట్టాలి. ఈ టాస్క్ హోరాహోరీగా సాగినట్లు కనిపించింది. ఈ టాస్క్ ఫిజికల్ టాస్క్ ను మైమరిపించింది.


ఈ క్రమంలోనే బొమ్మ కోసం శ్రీహాన్, శ్రీ సత్య తలపడగా కుర్చీలో నుంచి కిందపడిపోయిందట శ్రీసత్య. నీ వల్లే తను కిందపడియిందని మెరీనా అనడంతో ఫైర్ అయ్యాడు శ్రీహాన్. బొమ్మను తీసుకునేటప్పుడు పడింది నేను లాగితే కాదు.. మైండ్ యువర్ వర్డ్స్ అంటూ అరిచాడు. తర్వాత శ్రీసత్య, రేవంత్ కు మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: