పరిటాల శ్రీరామ్ ను కలిసిన విష్ణు...!!

murali krishna
విష్ణు..ఆయన తండ్రి మంచు మోహన్ బాబు.. ఇద్దరూ 2019 ఎన్నికల వేళ చంద్రబాబు తీరుకు విసిగి వేసారి వైసీపీలో చేరారు.


మోహన్ బాబు అయితే వైసీపీ తరుఫున ప్రచారం చేశారు.జగన్ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబుకు రాజ్యసభ సీటు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ జగన్ ఇవ్వలేదు. ఇక ఈ మధ్య వీరి మధ్య గ్యాప్ కూడా పెరిగినట్టు వార్తలు వచ్చినా ఎవ్వరూ నోరు మెదపలేదు.


మంచు విష్ణు.. స్వయానా సీఎం జగన్ కు బావమరిది అవుతాడు. జగన్ చిన్నాన్న కూతురు విరోనికనే విష్ణు పెళ్లి చేసుకున్నాడు. వైఎస్ ఫ్యామిలీతో వియ్యం అందుకున్నారు మోహన్ బాబు ఫ్యామిలీ.. అప్పటి నుంచి వీరిమధ్య సఖ్యత కొనసాగుతూనే ఉంది.


అయితే మంచు ఫ్యామిలీకి చెందిన 'విద్యానికేతన్ ' పాఠశాలలకు స్కాలర్ షిప్ లు మంజూరు చేయడంలో జగన్ సర్కార్ జాప్యం చేయడాన్ని మోహన్ బాబు ప్రశ్నించారు. వైసీపీపై అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పటినుంచే జగన్ తో మంచు ఫ్యామిలీకి దూరం పెరిగిందట.


తాజాగా మంచు విష్ణు, మోహన్ బాబు అడుగులు టీడీపీ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. జిన్నా మూవీ ప్రమోషన్ కోసం ఇటీవల అనంతపురం జిల్లా అనంతలక్ష్మీ కాలేజీకి మంచు విష్ణు వెళ్లాడు. అక్కడి హీరో మంచు విష్ణును పరిటాల శ్రీరామ్ మర్యాదపూర్వకంగా కలిశారట.. ఈ సందర్భంగా వీరి మధ్య చర్చలు సాగినట్టు సమాచారం.


తిరుపతిలో విద్యాసంస్థలు పెట్టి సేవ చేస్తున్న వీరికి తిరుపతి అసెంబ్లీ టికెట్ ను టీడీపీ ఆఫర్ చేసిందని.. ఈ మేరకు పరిటాల శ్రీరామ్ ఈ విషయాన్ని మంచు విష్ణుకు తెలియజేశాడని ప్రచారం సాగుతోందట.. ఈ క్రమంలోనే టీడీపీ లోకి మంచు ఫామిలీ రానుందా.? అనే ప్రచారం ఊపందుకుంది. తిరుపతి నుండి మంచు విష్ణు పోటీకి దిగనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై మంచు విష్ణు కానీ.. టీడీపీ కానీ ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: