సంచలనం సృష్టిస్తున్న కాంతారా...!!

murali krishna
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రసీమనే అనే భావన అయితే ఉండేది. దానిని బెంగాల్ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే చెరిపేశారు. ఇక దక్షిణాది సినిమా అంటే ‘మదరాసీ చిత్రం’ అనే పేరుండేది


ఎందుకంటే అప్పట్లో దక్షిణాది నాలుగు భాషల చిత్రాలకు మదరాసే కేంద్రం. ఇప్పుడు సౌత్ సినిమా అంటే తెలుగు చిత్రాలదే పైచేయి అయినా ఐఎండీబీ రేటింగ్స్‌లో కన్నడ సినిమాలు సంచలనం సృష్టిస్తూ ఉండడం గమనర్హం.. ఇటీవల తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించిన ‘కాంతార’ కన్నడ సినిమా ఐఎండీబీ రేటింగ్స్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ఏకంగా 9.5 రేటింగ్ లభించింది. ఇక కన్నడలోనే ‘777 ఛార్లీ’ చిత్రం 9 పాయింట్స్, మూడోస్థానంలో నిలచిన ‘డోళ్ళు’ 8.8 పాయింట్స్ తోనూ, ‘గురుశిష్యరు’ 8.6తోనూ, ‘కేజీఎఫ్-2’ 8.4 పాయింట్స్ తోనూ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయట.


ఇక తమిళ చిత్రాల విషయానికి వస్తే.. కమల్ హాసన్ ‘అన్బే శివమ్’ 8.7 పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలచింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 19 ఏళ్ళవుతూ ఉన్నా, ఇంకా అగ్రస్థానంలో సాగుతూ ఉండడంతో నంబర్ వన్ ప్లేస్ దక్కించుకుంది. గత సంవత్సరం విడుదలైన సూర్య ‘జై భీమ్’కు 8.9 పాయింట్స్ ఉన్నా, రెండో స్థానంలో ఉంది. 8.3 పాయింట్స్ తో ‘రాచ్చసన్’ మూడో స్థానంలోనూ, 8.6తో మణిరత్నం ‘నాయకన్’ నాలుగో స్థానంలోనూ, మణిరత్నం మరో చిత్రం ‘దళపతి’ 8.5 పాయింట్స్ తో ఐదో స్థానంలోనూ నిలిచాయి. కొన్నిసార్లు పాయింట్స్ ఎక్కువగా ఉన్నా స్థానాల్లో తేడా రావడానికి ఓ నిర్ణీత కాలంలో సదరు చిత్రం వ్యూయర్ షిప్ చూసి రేటింగ్ అయితే నిర్ణయిస్తారు.


మళయాళ చిత్రసీమవైపు చూస్తే..1993లో రూపొందిన ‘మణిచిత్రతాళ్’ 8.5 పాయింట్స్ తో నంబర్ వన్ స్థానంలో నిలచింది. దాని తరువాతి స్థానంలో ‘సందేశం’ 8.5 పాయింట్స్ తోనే ఉంది. 1989లో తెరకెక్కిన మోహన్ లాల్ ‘కిరీడం’ 8.4 పాయింట్స్ తో మూడో స్థానంలోనూ అవే పాయింట్స్ తో 2021లో విడుదలైన ‘#హోమ్’, ‘కుంబలంగి నైట్స్’ తరువాతి స్థానాల్లో నిలిచాయి. మన తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం 8.4 పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలచిందట.. కాగా 1957 నాటి విజయావారి అపురూప చిత్రం ‘మాయాబజార్’ 8.3 పాయింట్స్ తో రెండో స్థానం ఆక్రమించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘జెర్సీ’ 8.3 పాయింట్స్ తో మూడో స్థానంలోనూ, 8.2 పాయింట్స్ తో ‘నువ్వు నాకు నచ్చావ్’ నాలుగో స్థానంలోనూ, అవే పాయింట్లతో ‘సీతారామం’ ఐదో స్థానంలోనూ నిలిచాయట.


దక్షిణాదిన ఎటు చూసినా ఈ మధ్య కాలంలో 9కి పైగా పాయింట్స్ సాధించిన సినిమాలేవీ అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కన్నడ చిత్రం ‘కాంతార’ ఏకంగా 9.5 పాయింట్లతో అగ్రగామిగా నిలవడం అన్నది విశేషమే. మరి ఈ సినిమా మునుముందు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో కానీ రన్నింగ్‌లో మాత్రం ఏలాంటి సంచలనం సృష్టించలేదని తేలిపోయింది మరీ.ఎందుకంటే ఈ సినిమాను వారానికే హైదరాబాద్‌లో టెర్మినేట్ చేస్తూండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: