అబ్బా నందిని రాయ్ మామూలుగా లేదుగా..!

murali krishna
గతంలో తెలుగు సినిమాలో మన వారికి అవకాశాలు తక్కువే. కానీ ఇప్పుడు తెలుగు వారు కూడా తెగ రాణిస్తున్నారు సినిమా లో . ఎందరో హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుని విజయపథంలో దూసుకెళ్లారు.
ఇంకా సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది తమ అందాలను ప్రదర్శిస్తూ అవకాశాలను తెగ చేజిక్కించుకుంటున్నారు అని చెప్పవచ్చు . సామాజిక మాధ్యమాల్లో తమ ఎద అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు ఆనందం కలిగిస్తున్నారు. ఫలితంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తమ హాట్ ఫొటోలను  తెగ పోస్టు చేస్తున్నారు.
తెలుగులో సినిమా అవకాశాల కోసం ఎదురు చూసి సోషల్ మీడియా ద్వారా తమ హాట్ పిక్ లను పెడుతున్నారు ఈ నాటి తారలు . దీంతో నిర్మాతల కంట పడుతూ సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సుందరి అయిన నందినీ రాయ్ కూడా అలాంటి కోవలోకే వస్తోంది మరీ . మొదట మోడలింగ్ తో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె బాలీవుడ్ లో ఫ్యామిలీ ప్యాక్ అనే మూవీతో పరిచయం అయింది. తెలుగులో మాయ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ . ఇంకా మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
కొద్ది రోజులుగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ -2 లోకి ఎంట్రీ  కూడా ఇచ్చింది. తరువాత అవకాశాలు వస్తాయని భావించినా కుదరలేదు. ఇక ఏం చేయాలని ఆలోచించి తన హాట్ ఫొటోలు నెట్టింట్లో పెడుతోంది. బిగ్ బాస్ రెండో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నా సినిమా చాన్సులు మాత్రం ఈ నటి కి రాలేదు. దీంతో మధ్యలోనే షో నుంచి వెళ్లిపోయింది. కోతికొమ్మచ్చి లో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ లో నటించింది.
 
ప్రస్తుతం తన హాట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతూ బాగా యాక్టివ్ గా మారింది. అభిమానులతో ఎప్పుడు మాట్లాడుతోంది. అందం, అభినయం ఉన్న అవకాశాలు రాకపోవడంతో నిరుత్సాహం చెందకుండా అందాలను ఆరబోస్తూ ఫొటోలు, వీడియోలు పెడుతూ కుర్రకారును  తెగ రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ . ప్రస్తుతం ఆమె ఓ తెల్ల చీరలో పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూట తెలుపు చీరలో సముద్రం మధ్యలో దేవకన్యలా కనిపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా హల్ చల్ చేస్తోంది మరి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: