శ్రీముఖి ఇలా తయారైందేంటి బాసూ..!!

murali krishna
యంకర్ శ్రీముఖి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఈ అమ్మడు షోలు మాత్రమే కాదు పలు సినిమా ఈవెంట్ లను కూడా చేస్తూ బిజిగా ఉంది.కొన్ని సార్లు ఏదొక వార్త తో వైరల్ అవుతుంది..ఇప్పుడు కూడా మరోసారి వైరల్ అయ్యింది.మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్' రీమేక్‌ను తెలుగులో 'గాడ్ ఫాదర్' టైటిల్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే..
ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌తో పాటు తాజాగా విడుదల చేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కీలక పాత్రలో నటించారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ చేసారు. ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.
గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, చిరంజీవి స్పెషల్ సాంగ్‌ ఉంది. ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి.. ఓ ప్రైవేటు జెట్‌లో టాలీవుడ్ హాట్ యాంకర్ శ్రీముఖికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరును ఇంటర్వ్యూ చేస్తూ శ్రీముఖి చేసిన ఇంటర్వ్యూలో చిరంజీవి చూసి అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిరును చూసి శ్రీముఖి.. ఐ లవ్యూ చిరంజీవి గారు.. ఈ లుక్‌లో మీరు చాలా హాట్‌గా ఉన్నారని శ్రీముఖి చెప్పిన డైలాగుకు చిరంజీవి కాస్త గొంతు సవరించుకొని ఇక చాలు అన్నట్లు ముఖం పెట్టినా.. శ్రీముఖి ఎక్కడా తగ్గకుండా.. మిమ్మల్ని చూసి తట్టుకోలేపోతున్నాను అనే డైలాగు చెప్పే సరికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.మొత్తానికి ఈ మాటలు నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: