గాడ్‌ఫాదర్‌ సీక్వెల్ ఉందా?లేదా?

Satvika
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసీఫర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది గాడ్ ఫాదర్ మూవీ. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈసినిమా ఈ నెల 5న దరసరా సందర్భంగా ప్రపంచ వ్యప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఎన్వీ ప్రసాద్ - ఆర్.బి. చౌదరి కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఇప్పటికీ భారీగా వసూళ్లు రాబడుతుంది. ఈ నేపథ్యంలో మోహన్ రాజా టీమ్ తో చిన్న కార్యక్రమం చేశారు.

ఈ సందర్భంగా మోహన్ రాజా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. మోహన్ రాజా మాట్లాడుతూ .. లూసిఫర్ సినిమాను రీమేక్ చేయడం ఒక బాధ్యతగా తీసుకున్నా అని అన్నారు. అంతే కాదు.. రీమేక్ చేస్తున్నాం..అది కూడా ఆ రీమేకును మెగాస్టార్ తో చేస్తున్నాం.. ఇది ఇంకా బరువు.. బాధ్యతతో కూడుకున్న పని. అందువలన ఈ రెండు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూచాలా జాగ్రత్తగా సినిమాను కంప్లీట్ చేశాను అన్నారు మోహాన్ రాజా.

ఇక చిరంజీవి గారు మాస్ యాక్షన్ సినిమాల గురించి తెలిసిందే.. అలాంటి పాత్రలు చేయడంతో ఆయన నిజంగా మాస్టార్. అంతే కాదు ఆయనతో ఇలాంటి పాత్రలు ఇంకా చేయించాలని ఉంది. అందుకు తగ్గట్టు కొన్ని ఐడియాస్ కూడా తన దగ్గర ఉన్నాయి అన్నారు మోహన్ రాజ. అలాగే గాడ్ ఫాదర్ తో మన టీమ్ పై మేకర్స్ కి ఒక నమ్మకం కుదిరింది కనుక, గాడ్ ఫాదర్ 2 కూడా చేసే అవకాశం త్వరలోనే లభిస్తుందని అనుకుంటున్నాను అన్నారు మెహన్ రాజా. ఈ రకంగా చూసుకుంటే.. గాడ్ ఫాదర్ సీక్వేల్ పక్కా అన్నట్టు తెలుస్తోంది..ఈ సినిమాగురించి పూర్తీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ అన్నారు..ఆ సినిమా కోసం ఇప్పటి నుంచే ఆ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారూ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: