కాంతారా సినిమా సక్సెస్ అయ్యేనా..?

Divya
తెలుగులో గతంలో ఎక్కువగా ఇతర భాష డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా సందడి చేసేవి. కానీ ఇప్పుడు కన్నడ సినిమాలు ఈ మధ్యకాలంలో బాగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదట కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అంతేకాకుండా కేజిఎఫ్-2 కూడా కన్నడ ఇండస్ట్రీని దేశవ్యాప్తంగా జోరు చూపించడం జరిగింది. అలాగే రక్షిత్ శెట్టి నటించిన చార్లీ-777 , కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రొణ సినిమాలు కన్నడ ఇండస్ట్రీని ఒకసారిగా పాపులర్ అయ్యేలా చేశాయి.

అయితే తాజాగా విడుదలైన కాంతారా చిత్రం ఇప్పుడు కనడం ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా మారాలా చేయడానికి మరో అడుగు వేసింది అని చెప్పవచ్చు. మొత్తం పక్క కన్నడ ప్రాంతాలలో అక్కడ ఉండే నేటివీటితో డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి  ఈ చిత్రంలో నటించారు ఈ సినిమా కన్నడ నాట పెను సంచలనాన్ని సృష్టించింది. దీంతో ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు. కన్నడ సాంప్రదాయాలకు అనుగుణంగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ప్రేక్షకులను ఆకర్షించడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని హోంబలే  వంటి సమస్త అంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమా ఇప్పటికే హీరో ప్రభాస్ రెండు సార్లు చూశారా అయితే విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది దీంతో ఈ చిత్రం పైన తెలుగు ప్రేక్షకుల దృష్టి పడిందని చెప్పవచ్చు. అయితే కన్నడ నేటి విధి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం అంత త్వరగా మన తెలుగు ప్రేక్షకులకు అర్థం కావడం కష్టమేనని చెప్పవచ్చు నెమ్మదిగా ఈ సినిమా  మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పూర్తిగా భిన్నంగా ఉండే సాగే కథ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు హీరో రిషబ్ శెట్టి. మొదట ఈ చిత్రాన్ని కన్నడలో మాత్రమే విడుదల చేశారు ఆ తర్వాత పాన్ ఇండియా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: