ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు మంచి విజువల్ ట్రీట్..!!

murali krishna
స్టార్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు అభిమాన హీరో పుట్టినరోజు నాడు రక్తదానం, అన్నదానం  ఇలా ఎన్నో చేసేవారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. వాటితో పాటు ఫ్యాన్స్ సంతోషం కోసం తమ హీరో కెరీర్లో గల ఐకానిక్ చిత్రాల స్పెషల్ షోస్ ఏర్పాటు చేస్తున్నారు మరీ, రెగ్యులర్ రిలీజ్ కి ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గత చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇటీవల మహేష్, పవన్ కళ్యాణ్ బర్త్ డేస్ సందర్భంగా అభిమానులు పోకిరి, ఒక్కడు, జల్సా, తమ్ముడు చిత్రాలను రీరిలీజ్ చేశారు అభిమానులు . సదరు చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

మహేష్ ఫ్యాన్స్ పోకిరి చిత్రంతో నెలకొల్పిన రికార్డు కలెక్షన్స్ పవన్ ఫ్యాన్స్ జల్సా కలెక్షన్స్ తో బ్రేక్ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న బిల్లా మూవీ రీరిలీజ్ కి సన్నద్ధం అవుతున్నారు. అభిమానుల కోరిక మేరకు బిల్లా చిత్ర 4కే ప్రింట్ రెడీ చేశారు అంటా మరి . యూవీ క్రియేషన్స్ దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బిల్లా మూవీ 4కే క్వాలిటీతో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇక వరల్డ్ వైడ్ రికార్డు స్థాయిలో బిల్లా మూవీ ప్రదర్శనలు జరగనున్నాయి. బిల్లా రీరిలీజ్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డు బ్రేక్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు. మరి వారి కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. ఈ ఏడాది ప్రభాస్ 43వ ఏట అడుగుపెడుతున్నారు. ఇక పెదనాన్న కృష్ణం రాజు ఇటీవల మరణించగా ప్రభాస్ వేడుకలకు దూరంగా ఉండే అవకాశం కలదు.

అయితే ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేట్ చేసుకోనున్నారు. కాగా 2023 సంవత్సరం ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రత్యేకం కానుంది. ఆయన నుండి వచ్చే ఏడాది రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. జనవరిలో ఆదిపురుష్ విడుదల కానుంది. ఇక సమ్మర్ కానుకగా సలార్  కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలపై భారీ  ప్రేక్షకులకు అంచనాలున్నాయి. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్ర చేస్తున్నారు. ఇక సలార్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ గానే బజ్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: