క్రేజీ న్యూస్: లేడీ ఓరియెంటెడ్ కథలో సచిన్ కూతురు ?

VAMSI
క్రికెట్ దేవుడుగా భారతీయులు అందరూ ఆరాధించే వ్యక్తి సచిన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా తన ఆటతీరుతో ఇండియాకు ఎన్నో చిరస్మణీయయమైన విజయాలను అందించిన ఘనత సచిన్ కు దక్కుతుంది. క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ మెంటార్ గా వివిధ జట్లకు సేవలను అందిస్తున్నాడు. కాగా ఇతని వారసత్వాన్ని అందుకుని సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో బౌలర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇంకా అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేయలేదు. కాగా సచిన్ కు సారా టెండూల్కర్ అన్న కూతురు కూడా ఉందన్న విషయం తెలిసిందే.
ఈమె మాత్రం మోడలింగ్ ను తన కెరీర్ గా ఎంచుకుని దూసుకుపోతోంది. గతంలో చాలా సార్లు సారా పై త్వరలో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అవుతుందన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ అప్పట్లోనే ఈ వార్తలను తన తండ్రి సచిన్ టెండూల్కర్ కొట్టి పారేశాడు, అంతే కాకుండా ఇప్పట్లో తనకు హీరోయిన్ అయ్యే ఆసక్తి లేదని మీడియా ముఖంగా తెలియచేయడంతో అందరి నోళ్లు మూతపడ్డాయి. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ ఇయర్ బాలీవుడ్ ద్వారా హీరోయిన్ గా తన సినీ కెరీర్ ను స్టార్ట్ చేయనుందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మంతనాలు జరిగిపోయినట్లు తెలుస్తోంది.
సారాను డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ కూడా కొత్తవారు అని తెలుస్తోంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు గా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఎందరో సెలెబ్రిటీస్ కూతుర్లు సినిమాల్లో ప్రవేశిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటి వరకు సారా నుండి కానీ, డైరెక్టర్ నుండి కానీ ఏ విధమైన వార్త రాలేదు. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: